Saturday, 18 May 2024 09:22:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

TS Home Minister Mahmood Ali: గన్‌మెన్‌ చెంప పగలగొట్టిన హోంమంత్రి మహమూద్‌ అలీ.. వీడియో వైరల్‌!

Date : 06 October 2023 03:47 PM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తన వ్యక్తిగత గన్‌మ్యాన్‌ చెంప చెళ్లుమనిపించాడు. సహనం కోల్పోయిన మంత్రి తన గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ అమీర్‌పేట డివిజన్‌ డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' కార్యక్రమాన్ని మంత్రి తలసాని.. TS Home Minister Mahmood Ali: గన్‌మెన్‌ చెంప పగలగొట్టిన హోంమంత్రి మహమూద్‌ అలీ.. వీడియో వైరల్‌! హైదరాబాద్‌, అక్టోబర్‌ 10: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తన వ్యక్తిగత గన్‌మ్యాన్‌ చెంప చెళ్లుమనిపించాడు. సహనం కోల్పోయిన మంత్రి తన గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ అమీర్‌పేట డివిజన్‌ డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అలాగే ఈ రోజు మంత్రి తలసాని జన్మదినం కావడంతో ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆయన్ని ఆలింగనం చేసుకొని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంత్రి తలసానికి శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో ముందుగా ఆయన బోకే ఎక్కడ అంటూ పక్కనే ఉన్న తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని గన్‌ చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. అనంతరం పక్కనే ఉన్నకొందరు బొకే అందించడంతో.. మంత్రి మహమూద్ అలీ తలసానికి శాలువా కప్పి, బొకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన సదరు గన్‌మెన్‌ మంత్రిని అలాగే చూస్తుండిపోగా.. మంత్రి మాత్రం తలసానిని ఆలింగనం చేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సభలో హోం మంత్రి మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపు పలువురు విమర్శిస్తున్నారు. ఆయన హోంమంత్రి అయితే సిబ్బందితో ప్రవర్తించే తీరు ఇదేనా? ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చణీయాంశమైంది. మీరూ వీడియో చూసేయండి..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :