Saturday, 22 March 2025 04:01:59 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

‘జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం’– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హామి

Date : 21 October 2023 08:43 AM Views : 220

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికల సమీపిస్తుండటంతో పార్టీలు అన్ని వర్గాల వారిని ప్రసన్నం చేసుకునే యత్నం చేస్తాయి. ఆయా వర్గాలు కూడా తమ తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్తారు. మరికొందరు తమ డిమాండ్లతో పార్టీలకు వినతి పత్రాలు ఇస్తుంటారు. సమాజానికి ఫోర్త్ స్టేట్‌గా ఉన్న మీడియాపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు.. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వద్దకు చేర్చడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి మీడియాలో పనిచేసే వారిలో అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్ని పార్టీలకు వినతి పత్రాలు అందాయి. జర్నలిస్టులు మంత్రి హరీష్ రావును కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. హైదరాబాదు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామని హామి ఇచ్చారు. హైదరబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. తాజాగా కొందరు జర్నలిస్టులతో ఆయన ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన జర్నలిస్ట్ సొసైటీ సభ్యత్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే కచ్చితంగా అధికారంలోకి హరీష్ తెలిపారు. జర్నలిస్టుల హౌసింగ్ ఇష్యూను తప్పక పరిష్కరిస్తామన్నారు. కేటీఆర్‌తో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్‌తో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. కోర్టు కేసుల కారణంగా హైదరాబాదులో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించడం ఆలస్యమైందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత కోర్టు కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్‌ను పెట్టి, ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేసి.. జర్నలిస్టులకు అనుకూలంగా వచ్చేందుకు కృషి చేశామన్నారు. మూడోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, జర్నలిస్టు హౌసింగ్ సమస్యను ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొత్త, పాత సొసైటీల్లోని సభ్యులందరికి కలిపి ఒకేసారి ఇళ్ల స్థలాలను కేటాయించే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడుతామని ఆయన చెప్పారు. జిల్లాల్లో ఇప్పటికే మెజారిటీ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. అదే క్రమంలో హైదరాబాదులోని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా పలువురు జర్నలిస్టులు కలిశారు. జర్నలిస్టుల సంక్షేమంపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ అంశంపై ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :