Saturday, 18 May 2024 01:11:18 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

TS Constable Results 2023: వెబ్‌సైట్లో తెలంగాణ కానిస్టేబుళ్ల తుది ఎంపిక జాబితా.. ఆ పోస్టుల ఫలితాలు ఇప్పట్లోలేనట్లే!

Date : 05 October 2023 09:16 PM Views : 78

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదల చేయగా అందుకు సంబంధించిన కటాఫ్‌, వ్యక్తిగత మార్కుల వివరాలు ఈ రోజు (అక్టోబర్‌ 5) ఉదయం పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడినట్లైంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పోలీస్‌, ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్లు, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు ఈ నియామక.. TS Constable Results 2023: వెబ్‌సైట్లో తెలంగాణ కానిస్టేబుళ్ల తుది ఎంపిక జాబితా.. ఆ పోస్టుల ఫలితాలు ఇప్పట్లోలేనట్లే! హైదరాబాద్‌, అక్టోబర్‌ 5: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదల చేయగా అందుకు సంబంధించిన కటాఫ్‌, వ్యక్తిగత మార్కుల వివరాలు ఈ రోజు (అక్టోబర్‌ 5) ఉదయం పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడినట్లైంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పోలీస్‌, ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్లు, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టగా 15,750 పోస్టులకు సంబంధించిన ఫలితాలను పోలీస్‌ నియామక మండలి వెలువరించింది. వీరిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌లో పరిగణించనున్నట్లు ఈ సందర్భంగా నియామక మండలి తెల్పింది. అయితే పోలీస్‌ రవాణా సంస్థలో 100 డ్రైవర్‌ పోస్టులు, అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం తర్వాత వెల్లడిస్తామని, దీనిపై న్యాయ వివాదం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకే ఈ 325 పోస్టుల ఫలితాలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెల్పింది. కాగా కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన వివరాలను, కటాఫ్‌ మార్కులను అక్టోబర్‌ 5వ తేదీ ఉదయం ప్రకటిస్తామని చెప్పిన నియామక మండలి అక్టోబ‌రు 4న‌ రాత్రేకే వెల్లడించింది. ఫలితాలతోపాటు కటాఫ్‌ మార్కుల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :