Saturday, 18 May 2024 10:28:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు

Date : 29 November 2022 12:17 AM Views : 223

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు టీఆర్ఎస్ లో చేరారు. యూత్ కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి శ్రీనివాస్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అతనికి పార్టీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి వలసలు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి కారెక్కారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు వీలు దొరికినప్పుడల్లా విమర్శనస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే రేవంత్ రెడ్డిపై బాహంటంగానే విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్లో బలమైన నేతగా పేరుగాంచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ..కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. తాజాగా ప్రధాన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఆ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ కానుంది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :