Saturday, 18 May 2024 11:37:50 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Telangana Assembly Election: జోరందుకున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు సుడిగాలి పర్యటనలు

Date : 05 October 2023 09:35 PM Views : 85

జై భీమ్ టీవీ - తెలంగాణ / : KTR and Harish: మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు. అభివృద్ధి, విస్తరణ పనుల వేగం తెలంగాణలో జోరందుకుంది. సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన వెయ్యి పడకల ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల తరహాలో ఈ ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి ప్రత్యేక విభాగాలు ఉంటాయి. Telangana Assembly Election: జోరందుకున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు సుడిగాలి పర్యటనలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తుండటంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జోరందుకున్నాయి. మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు. అభివృద్ధి, విస్తరణ పనుల వేగం తెలంగాణలో జోరందుకుంది. సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన వెయ్యి పడకల ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల తరహాలో ఈ ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి ప్రత్యేక విభాగాలు ఉంటాయి. 24 గంటల పాటు రోగులకు సేవలందించేందుకు 275 మంది డాక్టర్లు ఈ ఆస్పత్రిలో ఉన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఇందులో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని హరీష్‌ రావు వెల్లడించారు. అటు నుంచి ఆయన మెదక్‌లో 180 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అలాగే మెదక్‌లోని గాంధీనగర్‌ కాలనీలో నిర్మించే అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 50 లక్షల రూపాయలతో నిర్మించిన సఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. రెండున్నర కోట్ల రూపాయలతో సకల హంగులతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. మరో వైపు ఐటీ మంత్రి KTR రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు జరిపారు. కొత్తూరు, షాద్‌నగర్‌లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంజారా భవన్‌కు శంకుస్థాపన చేశారు. అటు నుంచి మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో కొత్తగా నిర్మించిన విజయ మెగా డెయిరీని ప్రారంభించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. రోజుకు లక్ష లీటర్ల టెట్రా ప్యాక్‌ పాలు ఉత్పత్తి చేసే మెషీనరీ ఈ మెగా డెయిరీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ – ఊకదంపుడు మాటలతో రైతుల ఆదాయం రెట్టింపు కాదని ప్రధాని మోదీని విమర్శించారు. రావిర్యాల నుంచి నేరుగా వికారాబాద్‌ వెళ్లిన KTR అక్కడ గిరిజన భవన్‌, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌ జిల్లాలో దాదాపు 173 కోట్ల రూపాయల పనులకు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే లోపు తెలంగాణవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జోరుగా సాగేట్టే కనిపిస్తోంది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :