Saturday, 18 May 2024 01:42:05 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో మోడీ పర్యటనను అడ్డుకుంటాం:కూనంనేని సాంబశివరావు

Date : 08 November 2022 04:23 PM Views : 259

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనెల 12వ తేదీన రామంగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేసేందుకు ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాతనే షెడ్యూల్ ప్రకారమే మోడీ టూర్ ను బీజేపీ ప్లాన్ చేసిందన్నారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీనీ మళ్లీ రీ ఓపెన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 8 ఏండ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు బావులను బడా పారిశ్రామిక వేత్తలు ఆదానీ,అంబానీకి కేటాయించేందుకే ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రధాని పర్యటనకు నిరసనగా ఈనెల 10వ తేదీ (గురువారం) ఐదు జిల్లాల్లోని బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీని అడ్డుకుంటామని కూనంనేని సాంబశివరావు అన్నారు. తమిళనాడు, కేరళ,ఢిల్లీ, తెలంగాణ లో గవర్నర్ ల తీరు సరిగా లేదన్నారు. బ్రిటీష్ కాలంలో వచ్చిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తమిళిసై తెలంగాణను వదిలివెళ్లిపోవాలని సూచించారు. గవర్నర్ తీరుకు నిరసనగా త్వరలో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :