Saturday, 18 May 2024 10:08:40 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం :మంత్రి హరీష్ రావు

Date : 26 April 2023 10:17 AM Views : 136

జై భీమ్ టీవీ - తెలంగాణ / సిద్దిపేట జిల్లా : భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అయింది. ఈదురు గాలులు, కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు నాశనం అయ్యాయని ఆందోళనలకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయంలో నీళ్లపాలవుతుండంపై అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టపోయింది. పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. నాంచారుపల్లి, బక్రిచెప్యాల, పొన్నాల, ఏన్సాన్ పల్లి, తడ్కపల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇర్కోడ్, తొర్నాల, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, పెద్దగుండవెళ్లి, దుంపలపల్లి, దుబ్బాకలో వడగండ్ల వాన పడింది. ఈ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో పాటు..ఇతర ఉన్నతాధికారులతో కలిసి దెబ్బతిన్న వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని.. మంత్రి హరీష్ రావు ధైర్యం చెప్పారు. వర్షాభావంతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు యుద్ధప్రాతిపదికన సేకరించాలని మంత్రి హరీశ్ రావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :