Saturday, 18 May 2024 11:57:31 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేను ఎవరితోనూ విభేదాలు పెట్టుకోను: మంత్రి మల్లారెడ్డి

Date : 20 December 2022 10:26 AM Views : 277

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేడ్చల్ జిల్లాలోని ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మంత్రి మల్లారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తాను ఎవరితోనూ విబేధాలు పెట్టుకోనని..ఆ ఉద్దేశమే తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు తనకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. తానే స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడుతానని తెలిపారు. తాను గాంధేయవాదినని..ఇది తమ ఇంటి సమస్యగా పరిగణిస్తూ సమస్య పరిష్కారిస్తానని చెప్పారు. ఈ ఇష్యూపై కావాలనే మీడియానే అతిగా చూపిస్తుందని తెలిపారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు టీఆర్​ఎస్​ను కేసీఆర్ బీఆర్​ఎస్​గా మారిస్తే.. రాష్ట్రంలో మాత్రం బీఆర్​ఎస్​ నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి తీరుపై సొంత పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వివేకానంద్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మైనంపల్లి ఇంట్లో వీళ్లంతా సమావేశమయ్యారు. మేడ్చల్​ జిల్లా లోని అన్ని పదవులను తన అనుచరులకే మంత్రి మల్లారెడ్డి ఇచ్చుకుంటున్నారని, తమను ఖాతర్​ చేయడం లేదని వారు మండిపడ్డారు. విషయాన్ని కేసీఆర్​, కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యేల భేటీ గురించి తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మైనంపల్లి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మేడ్చల్​ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి సమావేశమయ్యామని అంటూనే మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం అనుమతి లేకుండా ఇలా ఐదుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవడం బీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మల్లారెడ్డివన్నీ ఒంటెద్దు పోకడలు మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. తమ సమస్యలను మంత్రిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిందిపోయి తమను లెక్కచేయడంలేదని అన్నారు. మేడ్చల్ జిల్లాలో పదవులన్నీ కేవలం మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్​కే పరిమితవుతున్నాయని ఆరోపించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో మంత్రి కేటీఆర్​తో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పిన తర్వాత కూడా మంత్రి మల్లారెడ్డి రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని, ప్రొటోకాల్ పాటించకుండా ప్రమాణం చేయించారని అన్నారు. రాష్ట్రంలో, గ్రేటర్​ హైదరాబాద్​లో పార్టీ పటిష్టంగా ఉందని, కార్యకర్తలకు పదవులు ఇచ్చి న్యాయం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని పదవులు కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే పరిమితమవుతుండడంతో మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలమైన తమపై ఒత్తిడి పెరుగుతున్నదని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో పదవులను ఒక్కొక్కరికి రెండు , మూడు సార్లు ఇస్తున్నారని విమర్శించారు. బాధ్యత గల మంత్రిగా జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. రాత్రికి రాత్రి నిర్ణయాలతో పార్టీ ఇబ్బందులు పడుతుందని పేర్కొన్నారు. మంత్రిగా మల్లారెడ్డి అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. అధిష్టానం చెప్పినా మంత్రి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసమే పోరాటం చేస్తున్నామని అన్నారు. న్యాయం చేయాల్సిన మంత్రి ఒంటెద్దు పోకడలకు పోవడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నించారు. మంత్రి తీరును కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :