Wednesday, 15 January 2025 07:50:56 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

గన్‌మెన్‌ను చెంపదెబ్బ ఘటనపై స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ.. ఏమన్నారంటే.. వీడియో

Date : 08 October 2023 08:49 AM Views : 192

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే.. గన్‌మెన్ పట్ల మహమ్మద్ అలీ తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలీ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే.. గన్‌మెన్ పట్ల మహమ్మద్ అలీ తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలీ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. రేయి పగలు తన్ను కంటికి రెప్పలా భద్రత కలిగిస్తున్న ఆ గన్‌మెన్ తన కుమారుడు లాంటి వాడని.. అందరూ తన బిడ్డలేనని.. అనుకోకుండా జరిగిందని పేర్కొన్నారు. తాను ఎవరికైనా, ఎంత చిన్నవారికైనా గౌరవం ఇస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మలక్‌పేట మహబూబ్‌ మెడిసిన్ గంజ్‌లోని మార్కెట్‌ యార్డులో రూ. 53 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిన్న గన్‌మెన్‌ ఘటనను పట్టించుకోవద్దని ప్రేమతోనే వ్యవహారించానంటూ పేర్కొన్నారు. కొట్టాలనే ఉద్దేశం ఏ కోశాన లేదన్నారు. అందరినీ తన బిడ్డల మాదిరిగానే చూసుకుంటానని తెలిపారు. తనతో ఉన్నవారందరూ తన బిడ్డలేనని.. వారిని అలా చూసుకుంటానని వివరణ ఇచ్చారు. కాగా.. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​పుట్టినరోజు సందర్భంగా.. హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూల బొకే విషయంలో మహమూద్​అలీ.. తన గన్​మెన్​పై చేయిచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మహమ్మద్ అలీపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ.. తన భద్రత సిబ్బందిపై వివరించిన తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. హోంమంత్రి అలా చేయడం తగదంటూ దేశవ్యాప్తంగా మహమ్మద్ అలీ తీరును తప్పుబట్టారు. ఈ తరుణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ ఈ విధంగా స్పందించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :