Saturday, 18 May 2024 01:11:17 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సీఎం కేసీఆర్ వారం రోజుల షెడ్యూల్ ఇదే.. నామినేషన్ ఎప్పుడు.. ఎక్కడి నుంచి వేస్తారంటే..

Date : 10 October 2023 09:33 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : CM KCR Public Meeting Schedule:బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు(సీఎం కేసీఆర్) రెండు చోట్ల పోటీ చేయనున్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్‌ 9వ తేదీన రెండు చోట్ల నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలోని గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్, అక్టోబరు 10: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉన్న ఇమేజ్‌ని కాపాడుకుంటూ హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టాలన్న టార్గెట్‌తో ఉంది గులాబీపార్టీ. నవంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన నామినేషన్ పత్రాలను రెండు చోట్ల దాఖలు చేస్తారని ప్రకటించింది బిఆర్‌ఎస్ ప్రకటించింది. రాష్ట్రంలోని గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. అక్టోబర్ 15న తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులతో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమావేశం కానున్నారు. సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ-ఫారమ్‌లను అందజేయనున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేయడంతోపాటు ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించనున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులకు సీఎం కొన్ని సూచనలు చేయనున్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ అధినేత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్టోబరు 16న జనగాం, భోంగిర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే బహిరంగ సభకు బీఆర్‌ఎస్‌ అధినేత హాజరవుతారు. అక్టోబర్‌ 17న సిద్దిపేట, సిరిసిల్లలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. అక్టోబరు 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గం, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. బీఆర్‌ఎస్ చీఫ్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ముందు సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం గజ్వేల్‌లో సీఎం తొలి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. బీఆర్‌ఎస్ చీఫ్ కామారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటలకు రెండో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :