Saturday, 14 September 2024 03:04:22 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఖమ్మం వార్‌.. నిన్నటి దాక ఓ లెక్క.. ఇప్పుడు అంతకు మించి హైవోల్టేజ్

Date : 25 October 2023 09:45 PM Views : 124

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఖమ్మం వార్‌.. సవాళ్లు బరాబర్‌.. నిన్నటి దాక ఓ లెక్క..ఇప్పుడు అంతకు మించి హైవోల్టేజీ పాలిటిక్స్‌. నాడు ముగ్గురు మిత్రులు.. పువ్వాడ.. తుమ్మల..పొంగులేటి అధికార బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. నేడు రాజకీయ ప్రత్యర్ధులుగా మారారు. పోటీ చేసిన చోటుపైనే కాదు టోటల్‌గా పదికి పది సీట్లపై ముగ్గురు గురి పెట్టారు. మరి దస్‌ కా దమ్‌ ఎవరిది? అన్నది తేలాల్సి ఉంది. రాజకీయాలందు.. ఖమ్మం రాజకీయాలు వేరయా..!!! అవును.. తెలంగాణ రాజకీయాలంతా ఒక ఎత్తైతే.. ఒక్క ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు..!! రసవత్తర రాజకీయాలకు గుమ్మం..ఖమ్మం. మొన్నటి దాక కారులో షికారుచేసిన ముగ్గురు నేతలు..ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. నిన్నటి దాక పొంగులేటి- పువ్వాడ మధ్య మాటలయుద్ధం. తుమ్మల సీన్‌లోకి వచ్చాక ఖమ్మం రాజకీయాలే కాదు.. ఆయన డైలాగులూ మరో లెవల్‌…. ఖమ్మం అడ్డాగా ఖాకీలను టార్గెట్‌ చేస్తూ డైనమైట్‌ లాంటి డైలాగు పేల్చారు తుమ్మల. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తుమ్మల నాగేశ్వరావు, భట్టి సహా ఇతర నేతలు ప్రచారం నిర్వహించారు. కొందరు అక్రమ కేసుల వ్యవహారం వాళ్ల ముందు పెట్టడంతో తుమ్మల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షపమాణ చెప్పకుండా, కేసులు కొట్టేయకుండా ఏ ఒక్క పోలీస్‌ను బదిలీ కూడా చేసేది లేదని వార్నింగ్ ఇచ్చారు తమ్మల. అంతే బీఆర్‌ఎస్‌ నుంచి ఖండన బాణం దూసుకు రానే వచ్చింది. తుమ్మల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు పువ్వాడ అజయ్‌. అహంకార పూరిత వ్యాఖ్యలను ప్రజలను గమనించాలన్నారు. BRS హ్యాట్రిక్‌ పక్కా.. ఖమ్మంలో మళ్లీ తన గెలుపే గ్యారెంటీ అంటున్నారు పువ్వాడ. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఇంటింటికిచేరాయన్నారు. ఖమ్మం ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు పువ్వాడ అజయ్‌. ఖమ్మం ఖచ్చితంగా కాంగ్రెస్‌ చేతికేనంటున్నారు తుమ్మల. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 40 ఏళ్లు కష్టపడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్శి చేశానన్నారు. రాహుల్‌-రేవంత్‌ ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఖమ్మం జిల్లాలో అవినీతి అరాచకాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు తుమ్మల. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌- తుమ్మల నాగేశ్వరరావు మధ్య సవాళ్ల వార్‌ పీక్స్‌కు వెళ్లింది. నాట్‌ ఓన్లీ ఖమ్మం. జిల్లాలోని పదికి పది నియోజవర్గాల్లో బీర్‌ఎస్‌దే గెలుపని పువ్వాడ.. జిల్లాలో టోటల్‌గా క్లీన్‌ స్వీప్‌ కాంగ్రెస్‌దేనని తుమ్మల శపథాలు చేశారు. పరస్పర ఆరోపణలు..విమర్శలు సవాళ్లతో ఖమ్మం రాజకీయం అంతకంతకు వేడుక్కుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :