Saturday, 18 May 2024 12:36:45 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందంటే..? సీఎం కేసీఆర్ లెక్క ఇదీ..!

Date : 20 October 2023 08:22 PM Views : 100

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి 95 నుండి 105 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలోని కన్వెన్షన్‌ హాల్లో గజ్వేల్‌ బీఆర్ఎస్‌ కార్యకర్తలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. గజ్వేల్‌కు ఏం కావాలో అన్నీ పనులు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనను కడుపులో పెట్టుకొని గెలిపించారని, ఈ సారి ఆ పక్కనున్న రెండు మూడు నియోకవర్గాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందన్నారు. గజ్వేల్‌కు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న సీఎం కేసీఆర్.. గజ్వేల్‌కు ఏం కావాలో తాను అన్నీచేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత నెలకు ఒక్కపూట గజ్వేల్‌లోనే ఉంటానన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ సారి గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ గజ్వేల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి.. వారికి భరోసానిచ్చారు. వచ్చేది బీఆర్‌ఎస్సే, గెలిచేది మనమే..మరింత అభివృద్ది చేద్దామంటూ కేడర్‌కి పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :