Saturday, 18 May 2024 10:51:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. కుటుంబ సభ్యుల సంచలన ప్రకటన.. అలా చేయొద్దంటూ..

Date : 17 October 2023 06:25 PM Views : 73

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రవళిక సూసైడ్‌ కేసు తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అశోక్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక సూసైడ్‌కు సంబంధించి ఆమె కుటుంబీకులు వాళ్ల వాళ్ల వాగ్మూలాన్ని పోలీసులకు వెల్లడించారు. శివరామ్ అనే యువకుడి వేధింపులతోనే తన కూతురు ప్రవళిక బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి విజయ పేర్కొంది. రాజకీయాల కోసం ప్రవళిక మరణాన్ని వాడుకోవద్దంటూ ప్రవళిక తల్లి, సోదరుడు కోరారు. పరీక్షలు వాయిదా వల్లనే ప్రవిళక చనిపోయినట్లు చెప్పాలని కొందరు నేతలు చేస్తున్న ఒత్తిడిని కుటుంబీకులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. దయచేసి తమను వేధించండం ఆపాలని అందరినీ కోరారు. కాగా.. హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ప్రవళిక గత వారం ఆత్మహత్య చేసుకుంది. అయితే, పరీక్షల వాయిదా వల్లనే ఆమె చనిపోయిందంటూ పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ప్రవళిక తల్లి .. సోదరుడు మీడియాతో మాట్లాడారు. ప్రవళిక మరణాన్ని రాజకీయాలకు వాడుకోవద్దంటూ సూచించారు. గొడవలు ఉంటే మీరు చూస్కోండి.. ముందుగా ప్రవళిక తల్లి మర్రి విజయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవళిక. రెండు సంవత్సరాల నుంచి నేను నా బిడ్డను అక్కడ చదివించుకుంటున్న. నా కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. మేమే ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని అక్కడ పంపి చదివిపిస్తున్నాం. కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి. నా బిడ్డ మాదిరిగానే వాడికి శిక్ష వేయండి.’’.. అంటూ వాపోయారు. మా దగ్గరికి రావొద్దు.. ప్రవళిక తమ్ముడు కుమార్ మాట్లాడుతూ.. ‘‘అక్క హాస్టల్ కు నా హాస్టల్ కు 5 నిముషాల దూరం ఉంటుంది. వారానికి మూడు నాలుగు సార్లు కలిసి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి వేరే అమ్మాయి వల్ల పరిచయం అయ్యాడు. అప్పటినుండి అక్కకి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్ కి వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం వల్ల, అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు , నాకు ఎవరికి చెప్పిన ఏమంటారో ఎం ప్రోబ్లం వస్తుందో ఇంట్లో అని చాలా డిప్రషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ముఖ్యంగా అక్క చనిపోవడానికి కారణం హాస్టల్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడిపించడం, కాల్ చెయ్యడం, ఫ్రెండ్స్ ఫోన్ నుండి ఇలా వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చెయ్యడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే శివ రామ్ ని ఎక్కడ ఉన్న పట్టుకుని తన అక్క చనిపోయిన్నట్టుగా ఉరి తీసి గాని ఎన్ కౌంటర్ గాని చేసి ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి. ప్రభుత్వం, కేసీఆర్ చేసారని చెప్తున్నారు కానీ వారు చెయ్యలేదు. గాని మాకు న్యాయం చెయ్యాలనుకుంటే వాడిని శిక్షించాలి. చాలా మంది మాఇంటికి వచ్చి ఏదో ఒకటి చెప్పడం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవని ఏ పార్టీ అవని మా దగ్గరకి రావద్దు’’ అంటూ కోరారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :