Saturday, 18 May 2024 01:00:03 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

శబరిమల అయ్యప్ప భక్తులకు అలెర్ట్.. కేరళలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడే అవకాశం..

Date : 24 November 2023 08:23 AM Views : 101

జై భీమ్ టీవీ - తెలంగాణ / : బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాలతో సహా కేరళ, తమిళనాడులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఈ వారంలో రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను కారణంగా దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్టల్ కర్నాటక, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక ప్రాంతాలలో భారీ వర్షాలు, కేరళ-మహేలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లో 26 వరకు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు లేవని స్పష్టం చేసింది. మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రకృతి విపత్తులు కూడా సంభవించే ప్రమాదం కూడా ఉందని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. కొండ ప్రాంతాల్లో పర్యటించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు అధికారులు. కొండచరియలు విరిగిపడడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా.. రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరిగి ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని యాత్రికులకు సూచించారు అధికారులు. మరోవైపు.. సహాయక బృందాలు అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కేరళ ప్రభుత్వం. ఇక.. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు భారీ వర్షం అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :