Thursday, 25 July 2024 05:56:29 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

జనసంద్రంగా భారత్ జోడో యాత్ర

Date : 07 November 2022 09:56 AM Views : 473

జై భీమ్ టీవీ - తెలంగాణ / మేదక్ జిల్లా : వణుకు పుట్టించేలా చలి పెడుతున్నా, పొగమంచు కురుస్తున్నా లెక్క చేయకుండా పొద్దున ఆరు గంటలకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించారు. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కొద్దిసేపులోనే జనసంద్రంగా మారింది. మొదటి విడతగా పెద్ద శంకరంపేట్ మండలం కమలాపూర్ యాత్ర సాగింది. విరామం తరువాత నారాయణ్ ఖేడ్ మండలం నిజాంపేట్ వరకు కారులో వెళ్లి అక్కడి నుంచి జిల్లా బార్డర్ లోని మహాదేవ్ పల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. దారి పొడువునా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద జెండాలు, నాగళ్లతో రాహుల్ గాంధీకి వెల్​కం చెప్పి ఆయనతో పాటు నడిచారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కొల్లపల్లి వద్ద జోడో యాత్రలో జాయిన్ అయి రాహుల్ తో కలిసి కొంతదూరం నడిచారు. పెద్దశంకరంపేటలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో రాహుల్ పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడే సివిల్ కాంట్రాక్టర్ కోయిల కొండ్ల యాదగిరి ఇంట్లో జై రామ్ రమేశ్, రేవంత్ రెడ్డి, సీతక్కతో కలిసి ఆయన టీ తాగారు. యాదగిరి మనుమడు కార్తవీర అరుదైన హైపో డైఫోక్లాసెస్ వ్యాధితో బాధ పడుతున్నట్టు తెలుసుకొని మెరుగైన చికిత్స అందేలా చూస్తామని రాహుల్​ హామీ ఇచ్చారు. పెద్ద శంకరం పేటలో యాత్రలో రద్దీ ఎక్కువై తోపులాట జరగడంతో మాజీ సర్పంచ్ జై హింద్ రెడ్డి కిందపడి చేయి ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలిసి రాహుల్ ఆయనను పరామర్శించారు. ఆ తరువాత మార్గ మధ్యంలో బీడీ కార్మికులు, చెరుకు రైతులు, సింగరేణి కార్మికులు తమ సమస్యలను రాహుల్ కు విన్నవించారు. పెద్దశంకరంపేట్ మండలం కమలాపూర్ సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు 500 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శించారు. నిజాంపేట్ లో గిరిజన మహిళలు నృత్యాలతో, మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. కుమ్మరులు మట్టితో కుండ చేసే విధానాన్ని పరిశీలించారు. ఎడ్ల బండి ప్రదర్శనను తిలకించారు.ఈనెల 2న సంగారెడ్డి జిల్లా లింగంపేట్ వద్ద మొదలైన జోడో యాత్ర సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఐదు రోజుల పాటు దాదాపు 90 కిలో మీటర్ల మేర కొనసాగి సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం మాసాన్ పల్లి వద్ద ముగిసింది. అక్కడి నుంచి రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్ గల్ కు వెళ్లి పోయారు. యాత్రలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, టి.సుబ్బిరామి రెడ్డి, సురేశ్​షేట్కార్, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సంపత్, నారాయణ ఖేడ్ సెగ్మెంట్ నాయకులు సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :