Saturday, 14 September 2024 03:53:10 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

Date : 30 December 2022 10:51 AM Views : 234

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : గచ్చిబౌలి: ఈ నెల 31న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ట్యాక్సీ, క్యాబ్​ డ్రైవర్లు రూల్స్​ ఫాలో కావాలే.. 31న అర్ధరాత్రి క్యాబ్​లు, ఆటోలు, ట్యాక్సీలు డ్రైవింగ్​ చేసే డ్రైవర్లు యునిఫాం వేసుకొని, వెహికల్స్​కు సంబంధించిన డాక్యుమెంట్స్​ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. రూల్స్​ బ్రేక్​ చేసిన, పబ్లిక్​ వద్ద ఎక్కువ డబ్బు వసూలు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. పబ్​లు.. బార్​లలో.. పబ్​లు, బార్ల మేనేజ్​మెంట్లు కచ్చితంగా రూల్స్​ పాటించాలి. పబ్​లు, బార్లకు వచ్చే కస్టమర్లకు పరిమితికి మించి లిక్కర్ అమ్మకూడదు. అదే విధంగా మద్యం సేవించిన కస్టమర్లను డ్రైవింగ్​ చేయకుండా ఆల్టర్నేట్​ అరేంజ్​మెంట్స్​ చేయాలి. డ్రంకెన్ డ్రైవ్.. సైబరాబాద్​ లిమిట్స్​లో డిసెంబర్​ 31న అన్నీ రూట్లలో డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. వెహికల్​ డ్రైవ్​ చేసే వ్యక్తి వెహికిల్​కు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసు అధికారులకు చూపించి సహకరించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ చేసి పట్టుబడితే కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతామని తెలిపారు. దీంతో పాటు రూ. 10 వేలు లేదా 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్​ రూల్స్​ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ తో డీసీపీ సమావేశం కంటోన్మెంట్​: న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని నార్త్​జోన్​ డీసీపీ చందనా దీప్తి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె సికింద్రాబాద్​ కార్కానాలో పబ్​లు, క్లబ్​లు, హోటల్స్​ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్​వేడుకలకు వచ్చే వారికిపార్కింగ్​ సదుపాయాలు ఆయా ఆర్గనైజర్లుఏర్పాటు చేయాలని, టైమింగ్​ విధిగా పాటించాలని,వేడుకల్లో పాల్గొన్నవారికి తిరిగి ఇంటికి చేర్చే వరకు నిర్వాహకులు బాధ్యత తీసుకోవాల్సిఉంటుందని పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారు మద్యం తాగి ఉంటే వారి వెహికల్స్ నడిపేందుకు నిర్వాహకులే ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో నార్త్​జోన్​ అడిషనల్​ డీసీపీ యోగేష్​ గౌతమ్​, ఏసీపీలు రమేశ్, సుధీర్​,రంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ ఇలా.. నెహ్రూ ఓఆర్ఆర్​పై కేవలం ఎయిర్​పోర్టుకు వెళ్లే వెహికల్స్ మినహా మిగిలిన వాటికి అనుమతి లేదు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వరకు ఉన్న పీవీఎన్ ఆర్​ ఎక్స్​ప్రెస్​ వే పై ఎయిర్​పోర్టుకు వెళ్లే వెహికల్స్ కు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. ఫ్లై ఓవర్లు బంద్​... సైబరాబాద్​ పరిధిలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు క్లోజ్​చేయనున్నారు. శిల్పా లేఅవుట్​ ఫ్లై ఓవర్​, గచ్చిబౌలి ఫ్లై ఓవర్​, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్​ 1,2, షేక్​పేట, మైండ్​స్పేస్​, రోడ్​ నెం.45 ఫ్లై ఓవర్​, దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి, సైబర్​ టవర్స్​ ఫ్లై ఓవర్​, జేఎన్టీయూ ఫ్లై ఓవర్, కైత్లాపూర్​ ఫ్లైఓవర్​, బాబు జగ్జీవన్​ రాం ఫ్లైఓవర్​(బాలానగర్​)ను క్లోజ్ చేయనున్నారు.​ ఈ రూట్లలో ట్రావెల్​ చేసే వెహికల్స్​ను, వాకర్స్ ను ఫ్లై ఓవర్ల పైకి అనుమతించరు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :