Saturday, 18 May 2024 12:36:39 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తక్కువ ధరలో హైదరాబాద్‌-షిర్డీ టూర్‌.. 2 రాత్రులు3 రోజులు ప్యాకేజీ..

Date : 16 October 2023 09:54 AM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : వీకెండ్ వచ్చిందంటే చాలు టూర్‌కు ప్లాన్‌ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా పలు సంస్థలు టూర్‌ ప్లాన్స్‌ అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐఆర్‌సీటీసీ పలు ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నుంచి షిర్డీకి ఐఆర్‌సీటీసీ మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్‌లను కవర్ చేస్తూ ఈ టూర్‌ ప్యాకేజీ ఉండనుంది. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించి ధరతో పాటు, పూర్తి షెడ్యూల్‌ వివరాలు మీకోసం.. హైదరాబాద్‌ నుంచి షిర్డీ టూర్‌ ప్యాకేజీని ‘సాయి సన్నిధి హైదరాబాద్‌’ అనే పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. అక్టోబర్ 25న ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ప్రతీ బుధవారం ఈ టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. 2 రాత్రులు, 3 రోజుల పాటు టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. ఇక ఈ టూర్‌ ఎలా ప్రారంభమవుతుందంటే.. తొలి రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సాయంత్రం 6.50 గంటలకు టూర్‌ ప్రారంభమవుతుంది. అజంతా ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ నెంబర్ 17064 సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌ సోల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి షిర్డీకి మరో వాహనంలో చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్‌ అవుతారు. అనంతరం షిర్డీలో ఆలయాన్ని సందర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్‌ నుంచి చెక్ అవుట్ అవుతారు. అనంతరం శని శిగ్నాపూర్‌కు వెళ్తారు. అక్కడి నుంచి నాగర్‌ సోల్‌ రైల్వే స్టేషన్‌కు బయలుదేరుతారు. రాత్రి 8.30 గంటలకు మళ్లీ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది. ఇక ఈ టూర్‌ ప్యాకేజీ విషయానికొస్తే.. సింగిల్‌ షేరింగ్‌కు రూ. 13,100గా ఉండగా డబుల్‌ షేరింగ్‌కు రూ. 8020గా ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 6390గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్‌ కోచ్‌లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్‌ క్లాస్‌ విషయానికొస్తే సింగిల్‌ షేరింగ్‌కు రూ. 11,410కాగా, డబుల్‌ షేరింగ్‌కు రూ. 6330గా నిర్ణయించారు. హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ వంటివి ఈ టూర్‌ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :