Saturday, 14 September 2024 03:07:14 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

చిలిపి పనులు వద్దు.. అడ్డంగా బుక్ చేస్తారు.. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు

Date : 16 October 2023 09:52 AM Views : 107

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఆదివారం నాడు(అక్టోబర్ 15) తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. ఈ బీఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. బీఫామ్స్ నింపే విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంపై దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. అంతా తమకే తెలుసు అన్నట్లు ప్రవర్తించొద్దంటూ సున్నితంగా హెచ్చరించారు కూడా. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, హైరానా పడొద్దని నేతలకు సూచించారు కేసీఆర్. చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవ్వొద్దని సూచించారు. హడావుడిలో బీఫామ్స్ తప్పుగా నింపొద్దని, ఆ తరువాత టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని అలర్ట్ చేశారు. ఇందుకు ఉదాహరణగా శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు కేసీఆర్. కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారని, ఇలాంటి వాటిపట్ల అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. పార్టీకి సంబంధించి న్యాయ కోవిదులు ఉన్నారని, సమస్యలుంటే వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అంతా తమకే తెలుసునని అనుకోవద్దని హితవు చెప్పారు. ఎన్నికకు ఎన్నికకు కొత్త నిబంధనలు వస్తున్నాయని, పార్టీకి అందుబాటులో ఉన్న న్యాయవాదులను సంప్రదించి అవసరమైన సహాయం తీసుకోవాలన్నారు. అప్‌డేట్ ఓటర్ లిస్ట్ వచ్చిందన్నారు. ఇక ఇవాళ 51 మందికి భీపామ్ ఇచ్చిన కేసీఆర్.. సోమవారం కూడా బీఫామ్‌లను అందజేస్తామన్నారు. మిగిలిన అభ్యర్థులు ప్రగతి భవన్‌కు వచ్చి బీఫామ్ తీసుకోవాలన్నారు. విపక్ష నేతలు సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, ఎన్నికల ఘట్టంలో చాలా కీలకంగా వ్యవహరించాలని నేతలకు చెప్పారు కేసీఆర్. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచనలు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. నేతలంతా కచ్చితంగా కార్యకర్తలందరినీ సంప్రదించాలన్నారు. వారికి నిరంతరం కాంటాక్ట్‌లో ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. భీఫామ్స్ అందజేసిన అనంతరం.. ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షల చెక్కు అందజేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ప్రశాంత్ రెడ్డి తరఫున బీఫామ్ అందుకున్న కవిత.. తెలంగాణ భవన్ వేదికగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేశారు. అయితే, వేముల ప్రశాంత్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కవిత బీఫామ్ అందుకున్నారు. ఇటీవలే వేముల ప్రశాంత్ రెడ్డి అమ్మ చనిపోయారు. ఈ కారణంగా ఆయన రాలేకపోయారు. దాంతో వేముల ప్రశాంత్ రెడ్డి బీఫామ్‌ను కవిత అందుకున్నారు. ఇక సీఎం కేసీఆర్ తరఫున కామారెడ్డి బీఫామ్‌ను గంప గోవర్థన్ రెడ్డి అందుకున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :