Saturday, 18 May 2024 01:59:48 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారుల దాడులు

Date : 24 November 2022 06:49 AM Views : 219

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండో రోజూ ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మంత్రి ఇంటి దగ్గరకు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సెంట్రల్ ఫోర్సెస్ భద్రత మధ్య అధికారులు తనిఖీలు కొనసాగించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్, ఫార్మసీ కాలేజీల్లోనూ సోదాలు చేశారు. యూనివర్సిటీ, ఆస్పత్రి ఇతర వ్యాపార సంస్థల లావాదేవీలపైనా ఆరా తీశారు. కార్యకర్తలకు అభివాదం సోదాలు కొనసాగుతున్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి.. అనుచరులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పారు. తమ బ్యాంకు అకౌంట్లు, లావాదేవీలు అన్ని సక్రమంగానే ఉన్నాయని, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని, అందరూ తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరారు. కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం తనిఖీల్లో భాగంగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నుంచి అధికారులు ఒక కారులో బ్రీఫ్ కేసును తీసుకెళ్లడం మీడియా ప్రతినిధులకు కనిపించింది. అందులో పలు కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో దాడుల తర్వాత సీల్ చేసిన సూట్ కేసులను కార్లలో తరలించారు. మల్లారెడ్డి ఇంట్లో కాలేజీల ఫీజులు, లావాదేవీలకు సంబంధించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు.. మంత్రి మల్లారెడ్డి బంధువు సంతోష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు మొత్తం దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. బ్యాంకు లాకర్లలో ఏం దొరికాయి..? మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో లభించిన సమాచారం ఆధారంగా బాలానగర్ లోని క్రాంతి బ్యాంక్ లో రెండో రోజు తనిఖీలు చేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురును బాలానగర్ లోని క్రాంతి బ్యాంకుకు తీసుకెళ్లారు. ఆ బ్యాంకులోని లాకర్లను ఐటీ శాఖ అధికారులు ఆమెతో ఓపెన్ చేయించారని సమాచారం. ఈ లాకర్ లోనే మరో 8 బ్యాంకులకు చెందిన ఆర్థిక లావాదేవీల వివరాలు, 12 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాము దొంగ దందాలు చేయడం లేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు తన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తన కొడుకును వేధించడంతోనే ఆస్పత్రి పాలయ్యాడని ఆరోపించారు. సోదాల పేరుతో దౌర్జన్యం చేయడం సరికాదని మల్లారెడ్డి వాపోయారు. అంతకుముందు హాస్పిటల్లో ఉన్న తమ కుమారుడు మహేందర్ రెడ్డిని పరామర్శించారు. టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు మహేందర్ రెడ్డిని పరామర్శించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్ రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :