Saturday, 18 May 2024 11:57:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో 28057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు లైన్ క్లియర్.. కొత్తగా 13 రకాల విభాగాలకు..

Date : 17 November 2023 09:25 AM Views : 69

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించింది ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అత్యవసరమైన సేవల ఓటర్లు వంటి గైర్హాజరైన ఓటర్ల నుండి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం 12డిలో మొత్తం 44,097 దరఖాస్తులు వచ్చాయి. అందులో 28,057 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఇక ఫారం 12డి పంపిణీ నవంబర్ 1న ప్రారంభం కాగా, దరఖాస్తులను సమర్పించేందుకు నవంబర్ 8 చివరి తేదీగా నిర్ణయించారు ఎన్నికల అధికారులు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్‌ బ్యాలెట్‌లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం వచ్చిన 610 దరఖాస్తుల్లో 339 మాత్రమే అంగీకరించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజవర్గం పరిధిలో 707 దరఖాస్తులు రాగా, వాటన్నిటికీ రిటర్నింగ్ అధికారులు అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 706 దరఖాస్తులు రాగా వాటికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. అత్యల్పంగా మక్తల్‌ నియోజకవర్గ పరిధిలో 19 దరఖాస్తులురాగా, రిటర్నింగ్‌ అధికారులు అంగీకరించారు. నారాయణపేట్‌ నియోజకవర్గ పరిధి లో 28 దరఖాస్తులు రాగా, 28 దరఖాస్తులను, వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలో 30 దరఖాస్తులకుగాను 26 పోస్ట ల్‌ బ్యాలెట్‌లను అనుమతించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలో 31 దరఖాస్తులు రాగా, 31 పోస్టల్‌ బ్యాలెట్‌లకు ఒకే చెప్పారు అధికారులు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 34 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిటర్నింగ్ అధికారులు. ఎన్నికల విధులతో సంబంధం లేని 13 రకాల అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉండే ఓటర్లకు తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఎలక్ట్రిసిటీ వింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన ఉద్యోగులు తపాలా బ్యాలెట్‌లకు అర్హులైన అత్యవసర సేవా విభాగంలో భాగంగా పరిగణించబడే ఉద్యోగులు, ఆహారం, పౌర సరఫరా, BSNL, EC ద్వారా అనుమతి పొందిన మీడియా వ్యక్తులు, అగ్నిమాపక సేవల సిబ్బందికి ఈసారి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :