Saturday, 14 September 2024 02:05:21 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తెలంగాణలో కాపీరైట్‌ పాలిటిక్స్‌.. కోమటిరెడ్డి కౌంటర్.. కేటీఆర్, హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..

Date : 17 October 2023 11:08 AM Views : 108

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికల కోడ్ వచ్చింది.. పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు.. ఘాటైన మాటలతో విరుచుకుపడుతున్నారు.. ఈ తరుణంలో తెలంగాణలో మేనిఫెస్టో పాలిటిక్స్ సెగలు రేపుతున్నాయి.. ఈ పథకం మాదే.. కాదు కాదు.. మాదే.. గ్యారెంటీలను మార్చి.. మేనిఫెస్టోగా ప్రకటించారు.. అసలు గ్యారెంటీలకు వారెంటీ ఉందా..? ఇలా .. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ- కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య మేనిఫెస్టోలపై మాటల యుద్ధం జరుగుతోంది. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలనే కాస్త అటూ ఇటూ మార్చి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఆరు గ్యారంటీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు వాటినే అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా రాజముద్ర వేసినట్లైందంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని .. తాము ప్రకటించిన 6 గ్యారంటీలనే కొద్దిగా మార్చి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిందంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అమలు చేయలేని హామీలు చేర్చారన్నారు. తామిచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాక్యానించారు. గుండెలు జారిపోయాయి.. అయితే, తమ మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని బీఆర్‌ఎస్‌ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తమ మేనిఫెస్టో చూసి ప్రతిపక్ష నేతల గుండెలు జారిపోయాయంటూ మంత్రి హరీశ్‌ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు వివరించారు. రెండు పార్టీలు కాపీ కొట్టాయ్.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పథకాల పేర్లను మార్చి ఆరు గ్యారంటీలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, తెలంగాణపై స్పష్టమైన అవగాహన లేనీది వారికేనంటూ మండిపడ్డారు. కాంగ్రెస్సే కాదు, బీజేపీ కూడా తమ పథకాలు కాపీకొట్టిందంటూ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :