Saturday, 18 May 2024 10:36:20 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కారు ఆపితే కోటి రూపాయలే.. చెక్‌పోస్టుల వద్ద గుట్టలుగా నోట్ల కట్టలు.. పోలీసుల కళ్లు బైర్లు..

Date : 18 October 2023 10:54 AM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ దంగల్‌లో కోట్లకు కోట్లు బౌండరీ దాటుతున్నాయి. ఫస్ట్‌ వీక్‌లోనే క్యాష్‌ బట్వాడ సెంచరీని దాటింది. తెలంగాణ వ్యాప్తంగా తనిఖీల్లో 130 కోట్ల నగలు, నగదును సీజ్‌ చేశారు పోలీసులు. గుట్టలుగుట్టలుగా పట్టుబడుతున్న డబ్బును చూసి అధికారులు సైతం అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు దాగిన బ్లాక్ మనీ సొమ్ము.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ్. చెక్ పోస్టుల వద్ద నోట్ల కట్టలు గుట్టలుగా బయటకొస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ దంగల్‌లో మనీ, మందు పంపిణీపై ఈసీ నిఘా పెంచింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. టచ్‌ చేస్తే క్యాష్‌ కోట్లలో పట్టుబడుతోంది. నగదుతో పాటు ఈసారి నగలు జిగల్మేన్నాయి. మియాపూర్‌లో ఓ కారులో 17 కేజీల బంగారం..17కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక కవాడీగూడలో 2 కోట్ల 9 లక్షల క్యాష్‌ పట్టుపడింది. తనిఖీల్లో క్యాష్‌ కన్నా గోల్డ్‌ ఎక్కువగా తళుక్కుమంటోంది. ఇప్పటి వరకు దాదాపు 56 కోట్ల నగదు పట్టుపడింది. అందుకు దీటుగా దగ్గర దగ్గర 39కోట్ల విలువైన నగలను సోదాల్లో సీజ్‌ చేశారు అధికారులు. పట్టుబడిన బంగారం జువెలర్స్‌ షాప్‌లకు సంబంధించిందని గుర్తించారు. ఐతే రశీదులు,సరైన వివరాలు చెప్పకపోవడంతో పట్టుబడిన బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో వుందని తెలిసినా కూడా లెక్కా పత్రాల్లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు, నగదు బట్వాడా చేయడం సరికాదన్నారు. సరైన వివరాలు చెప్పకపోవడం వల్లే ఆ సొత్తును సీజ్‌ చేయాల్సి వచ్చిందన్నారు పోలీసులు. ఇప్పటి వరకు తనిఖీల్లో 130 కోట్ల విలువైన నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు పోలీసులు. 72 కేజీల బంగారం..422 కిలోల వెండితో పాటు ఖరీదైన 42 డైమండ్లను స్వాధీనం చేసుకున్నారు. క్యాష్‌, గోల్డ్‌తో పాటు 2 కోట్ల 60 లక్షల విలువ చేసే మద్యాన్ని కూడా చేశామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వారంలోనే 100 కోట్లకు పైగా సొత్తు దొరకడం తీవ్ర కలకాలంరేపుతుంది . ఇటు హైదరాబాద్‌ సహా జిల్లాల వారీగా తనిఖీలను ముమ్మరం చేశారు అధికారులు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. మరోవైపు మనీ, మద్యం పంపిణీపై పొలిటికల్‌ సవాళ్లు- ప్రతిసవాళ్ల మోత మోగుతోంది. తెలంగాణ ఎన్నికల సంఘం నిర్వహించిన ఆల్‌ పార్టీ మీటింగ్‌లో పలువురు ఇదే అంశంపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో ఈసారైనా ప్రలోబాల పర్వానికి కళ్లెం పడుతుందా?లేదంటే మనీ, మద్యం ప్రవాహం మరింత కట్టలు తెగుతుందా?

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :