Saturday, 18 May 2024 10:36:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రేపటి నుంచే దసర సెలవులు.. విద్యార్థులకు పండగే పండుగ..

Date : 12 October 2023 08:41 AM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్(SA1) నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి. ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభం అయిన తరువాత ప్రకటిస్తారు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారికి ఈ సెలవులు ఉంటాయి. ఆ తరువాత రోజు నుంచి యధావిధిగా తరగతులు ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. దసరా సెలవులో మార్పు.. దసరా సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవును 23, 24కి మార్చేసింది. అంతకు ముందు 24, 25 తేదీలలో దసరా సెలవు ప్రకటించగా.. రెండు రోజుల క్రితం సెలవులపై క్లారిటీ ఇచ్చింది. దసరా పండుగ 23, 24 తేదీల్లోనే అని క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా దసరా పండుగ విషయంలో కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే క్లారిటీ సెలవులో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బతుకమ్మ సంబరాలు.. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు.. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :