Saturday, 18 May 2024 01:11:12 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

ఘన స్వాగతం పలకనున్న చిన్నజీయర్ స్వామి

Date : 29 December 2022 08:49 AM Views : 203

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. దేశానికే సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం అంగరంగ వైభవంగా ముస్తాబై రాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తుంది. కట్టుదిట్టమైన పోలీసు బలగాల భద్రత ఏర్పాట్ల మధ్య ముచ్చింతలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటన భాగంగా గురువారం ముచ్చింతల్ లోని సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రానికి సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. తర్వాత రిఫ్రిస్మెంట్ పూర్తి చేసుకొని అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటారు. అక్కడ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్మును వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియచేస్తారు. ఆ తర్వాత 216 అడుగుల రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుంచి రామానుజ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటుచేసిన డైనమిక్ ఫౌంటైన్ షో తిలకిస్తారు. చివరకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చూసిన తరువాత సందర్శకులని, భక్తులని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాష్ట్రపతి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు, సందర్శకులు పోలీసులకు, ఆలయ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :