జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్ మొదటి జాబితా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టికెట్ పొందిన క్యాండిడేట్లు సంతోషంలో ఉండగా.. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం నిరాశ చెందారు. దీంతో గాంధీ భవన్ నిరాశ, నిరసనలు తెలిపేవారితో అట్టుడికింది. కాంగ్రెస్ టికెట్ ఆశించి.. దక్కనివారు తమ నిరసన తెలియజేస్తుంటే.. టికెట్ దక్కని మరికొంతమంది నేతలు తమ నియోజకవర్గంలోనే మీటింగ్‌లు పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా గాంధీ భవన్‌కి చేరుకుని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి జై అంటూనే తమకు టికెట్ దక్కకపోవటానికి టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ ఓపెన్‌గా కామెంట్ చేశారు. గద్వాల్ టికెట్ ఆశించి భంగపడ్డ కురువ విజయ్ కుమార్ ఏకంగా టికెట్‌ను 10 కోట్ల నగదు, ఐదు ఎకరాల భూమికి అమ్ముకున్నారంటూ.. త్వరలోనే సాక్ష్యాలు బయటకు వస్తాయని గాంధీ భవన్ ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కొల్లాపూర్, మేడ్చల్, ఓల్డ్ సిటీ, ఉప్పల్ స్థానాల్లో భంగపడ్డ నేతలు గాంధీ భవన్ ఎదుట నిరసన తెలిపారు. కొల్లాపూర్ టికెట్ జూపల్లికి కేటాయించడంతో.. ఆ పార్టీ నేత జగదీశ్వర్‌రావు కార్యాలయంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేశారు. మేడ్చల్ టికెట్ రాకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి. ముఖ్య నేతల సమావేశంలో అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్‌ను అడ్డుకున్నారు హరివర్ధన్‌రెడ్డి వర్గం సభ్యులు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. ఇక పాతబస్తీకి చెందిన పలువురు నేతలు గాంధీభవన్‌కి చేరుకుని ఎంఐఎంని గెలిపించడానికి నాన్ లోకల్‌కి రేవంత్ రెడ్డి టికెట్లు కేటాయించారని నిరసన తెలిపారు. బహదూర్‌పుర టికెట్ యూసఫ్ దానిష్‌కి కేటాయించాల్సిన సీట్.. కానీ రాజేశ్‌కి కేటాయించారని నిరసన తెలిపారు. చంద్రయాన్‌గుట్ట టికెట్‌ను బోయ నరేష్‌కి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. యకతపుర టికెట్ సంబంధం లేని రవి రాజుకు కేటాయించారని.. మలక్పేట్ టికెట్ ముజఫర్‌కి కాదని ఎప్పుడూ గాంధీ భవన్ ముఖం చూడని కనీసం నామినేషన్ వేయని షేక్ అక్బర్‌కి కేటాయించారని కొందరు నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు గాంధీ భవన్‌లో మల్లు రవి ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నారు ముస్లిం మైనార్టీలు. దీంతో ప్రెస్ మీట్ మధ్యలో నుంచే మల్లు రవి వెళ్లిపోయారు. ఉప్పల్‌లో కంటతడి పెట్టుకున్నారు రాగిడి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంపై మనస్తాపం చెందానని.. పార్టీకి తన ఉసురు తగులుతుందని.. పార్టీ కోసం పనిచేసినవారిని గుర్తించరా అంటూ బాధ వెలబుచ్చుకున్నారు. గద్వాల్ టికెట్ ఆశించి భంగపడిన కురువ విజయ్ కుమార్.. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై డిసీప్లీనరీ కమిటీకి ఫిర్యాదులు అందాయి. కురువ విజయకుమార్‌ను, బహదూర్‌పూర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన కలీమ్ బాబాలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో సమావేశమైన కమిటీ.. టికెట్ రాలేదన్న ఆక్రోశంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గాంధీ భవన్‌లో పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ఫ్లెక్సీలను చించివేయడం, నాయకులపై అనుచిత వ్యాఖ్యలను చేయడం లాంటి చర్యలను సీరియస్‌గా పరిగణించింది. పార్టీ టికెట్ల కేటాయింపు ఏఐసీసీ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుంది. టికెట్ల కేటాయింపు పూర్తిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయాధికారం ప్రకారం జరిగిందని డిసీప్లీనరీ కమిటీ తెలిపింది.
Admin