Saturday, 18 May 2024 01:41:59 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రచారంలో డోస్ పెంచిన గులాబీ బాస్.. అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు సిద్ధం కావాలని పిలుపు

Date : 17 November 2023 09:31 AM Views : 81

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరింత డోస్ పెంచారు గులాబి బాస్ కేసీఆర్. భారీతీయ జనతా పార్టీ అంటే మత పిచ్చి, కాంగ్రెస్‌ అంటే మోసపూరితమన్న కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఫిక్ స్టేజీకి చేరుకుంటుంది. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ పార్టీలకు చెందిన నాయకులంతా తెలంగాణ బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. సామెతలు, సెటైర్లతోనే కాకుండా కాస్త ఢిపెరంట్‌గా డోస్‌ పెంచి సెంటిమెంట్‌ను జోడించారు. జాతీయ పార్టీల తీరును పూర్తిగా ఎండగట్టారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ప్రచార సభల్లో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందంటూ విమర్శించారు. నిన్నటి వరకు రైతు బంధు, ధరణి, కరెంట్ సెంట్రిక్‌ గా సాగిన ప్రచారం జాతీయ రాజకీయల వైపు మారింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. 58ఏళ్లు హరిగోస పడ్డామని ఆరోపించారు కేసీఆర్. తెలంగాణ బిడ్డల చావుకు కాంగ్రెస్‌కే కారణమంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందని, సెక్యులరిజం పార్టీ అని చెప్పారు కేసీఆర్. ఉద్యమ సమయంలో చేసిందంతా చేసి, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్. అంతేకాకుండా జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఈసారి కేంద్రంలో సంకీర్ణం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రజలు ప్రిపేర్ కావాంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే తెలంగాణ కలలు సాకరమవుతాయని చెప్పారు కేసీఆర్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :