Saturday, 14 September 2024 03:58:26 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నామినేషన్‌కు బయలుదేరిన అభ్యర్థి.. రోడ్డు వెంబటి పలకరించిన నల్ల మేకులు.. అంతా షాక్!

Date : 11 November 2023 03:39 PM Views : 111

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మరింత హీట్టెక్కుతున్నాయి. అధికార పీఠంమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రజా క్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతూ వారివారి వ్యూహ, ప్రతివ్యూహాలు.. ఎత్తుకు పైఎత్తులతో ముందుకెళ్తున్నాయి. కామెంట్స్, కౌంటర్స్, సవాళ్లు, ప్రతి సవాళ్లతో చలికాలం కాస్తా రాజకీయ వేడితో రంజుగా మారింది. పార్టీల అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, ప్రత్యరోపణలతో విరుచుకుపడుతున్నారు. అంతా ఒక ఎత్తైతే పాతబస్తీలో మాత్రం రాజకీయం విచిత్రంగా ఉంది. తెలంగాణకు గుండె అయినటువంటి హైదరాబాద్ టెక్నాలజీ, అభివృద్దిలో రోజు రోజుకు దూసుకుపోతూ ఒక వైపు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. మరోవైపు దానికి పూర్తిగా భిన్నంగా మారింది పాతబస్తీ. తరచూ చిన్నచిన్న గొడవలు జరిగే పాతబస్తీ మరోసారి వార్తల్లోకెక్కింది. పాతబస్తీలో మరోసారి చేతబడి వార్తలు గుప్పుమన్నాయి. ఇవి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ చేతబడి ఎన్నికల్లో ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నరన్నా వార్తలు రావడంతో దీనిపై ఒకింతా ఆసక్తిగా నెలకొంది. ఈ విషయం తెలసిన కొందరు స్థానిక నేతలు అందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను చార్మినార్ బీజేపీ అభ్యర్థిగా మేఘన రాణి అగర్వాల్‌‌ను అధిస్టానం ఎంపిక చేసింది. అయితే నామినేషన్ వేయడానికి అంతా సిద్ధం చేసుకుని బయలుదేరిన అమెకు ఆసక్తికర సంఘటన ఎదురైంది. తన కారు వెళ్లే దారిలో రోడ్డుపై ఎక్కవు సంఖ్యలో మేకులు పోసి ఉండటం కనిపించింది. తనను నేరుగా పోటీలో ఎదుర్కోలేక ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని, అందులో భాగంగానే చేతబడి ద్వారా కుట్రలు చేస్తున్నారని అరోపించారు మేఘన రాణి. తను నామినేషన్‌లో వేసే దారిలో చేతబడి చేసిన మేకులు వేశారని, తద్వారా వాహనాన్ని పంచర్‌ చేసి నామినేషన్‌ను అడ్డుకోవాలని చూశారని అనుమానం వ్యక్తం చేశారు ఆమె. ఇదిలావుంటే అలా రోడ్డుపై దారిలో మేకులు చల్లిన అల్లరి మూకలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేప ఇద్దరి అనుమానిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. అల్లరి మూకలు కావాలనే చేశారా? నిజంగా లేక బీజేపీ నేత ఆరోపించినట్టు ప్రత్యర్థి నేతల కుట్రలో భాగంగా ఇది జరిగిందా? అనే కోణంలో, మరింత లోతుగా ఇన్విస్టిగేషన్ చేస్తున్నారు భాగ్యనగరం పోలీసులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :