జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించింది. ఈ రెండు కమిటీల్లో స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్థానం దక్క లేదు. రాజకీయ వ్యవహారాల కమిటీకి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణిక్కం ఠాగూర్ చైర్మన్ గా ఉంటారు. ఈ కమిటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టివిక్రమార్కతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు చోటు దక్కింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ కుమార్ గౌడ్ ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీలో రేవంత్ సహా 40 మందిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది . ఇందులో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఈ రెండు కమిటీల్లోను స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టింది. గతంలో షోకాజ్ నోటీసుకు ఆయన ఇచ్చిన వివరణ సరిగా లేనందుకే రెండు కమిటీల్లో నియమించలేదని కాంగ్రెస్ లో ప్రచారం నడుస్తోంది. నలుగురు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ఎండీ అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ జగ్గా రెడ్డి మహేష్ కుమార్ గౌడ్
Admin