Saturday, 18 May 2024 09:22:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పార్టీ మారుతున్న నేతలకు వెరైటీ బ్రేకులు.. సొంత పార్టీ కార్యకర్తలపై నమ్మకం ప్రమాణాలు

Date : 14 November 2023 12:42 PM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మాట ఇవ్వడం ఎంత తేలికనో.. అదే మాట నిలబెట్టుకోడం కూడా అంత కష్టం.. అందుకే నమ్మి వచ్చిన కార్యకర్తలు ఎక్కడ చేయి జారుతారోనని పార్టీ నాయకులు జాగ్రతపడుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తల చేతనే ప్రయాణాలు చేయిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహరిస్తామని, ఎన్ని ప్రలోబాలకు గురి చేసినా పార్టీ మారమని ప్రమాణం చేస్తున్నారు నేతలు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానానికి 22 మంది 40 నామినేషన్లు దాఖలు చేయగా, ఏడుగురి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి చేత తిరస్కరణకు గురయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రెడ్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాంచంద్ర నాయక్ బరిలోకి దిగారు. దీంతో బీఆర్ఎస్-గ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చేజారకుండా బీఆర్ఎస్ నేతలు వింత పోకడకు తెరలేపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను బుజ్జగిస్తూ కారు దిగకుండా కాపాడుకుంటున్నారు. ఊరూరా వారిచేత ప్రమాణాలు చేయిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తల చేతనే దైవ సాక్షిగా ప్రయాణాలు చేయిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహరిస్తామని, ఎన్ని ప్రలోబాలకు గురి చేసినా పార్టీ మారమని ప్రమాణం చేస్తున్నారు నేతలు. ఏ ఒక్క కార్యకర్త పార్టీ వీడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే, ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట డోర్నకల్ లో ఆసక్తికర రాజకీయం చోటుచేసుకుంది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు జనంలో చర్చగా మారుతుంటే కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ గుబులు రేపుతున్నారు. తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్ రెబల్స్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. సభలు,సమావేశాలు నిర్వహిస్తూ జనంలో చర్చగా మారుతున్నారు. డోర్నకల్ నియోజకవర్గం నుండి ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించారు. రాంచంద్ర నాయక్, భూపాల్ నాయక్, నెహ్రూ నాయక్ ముగ్గురు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి పార్టీ అధిష్టానం రాంచంద్రనాయక్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. టిక్కెట్ ఆశించిన ముగ్గురు నేతలు నామినేషన్లు వేశారు..ఇక తాడో పేడో తేల్చుకుందాం అన్నట్లు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు బుజ్జగింపులకు తెర లేపారు.. నెహ్రూనాయక్ తో ఒక బ్యాచ్ భూపాల్ నాయక్ మరో బ్యాచ్ మంతనాలు జరిపారు. కానీ ఫలించలేదు.. భూపాల్ నాయక్ తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన భూపాల్ నాయక్ తన ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ కు ధీటుగా భారీ ర్యాలీ నిర్వహిస్తూ జనం చర్చగా మారారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ కోసం బౌన్సర్లను వెంట బెట్టుకొని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే భూపాల్ నాయక్ ఫోన్ చేసి మాట్లాదినట్లు సమాచారం. భూపాల్ నాయక్ మాత్రం తగ్గేదెలే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట డోర్నకల్ లో ఇప్పుడు ఆ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతుండడంతో పార్టీ శ్రేణులు, ప్రజలలో చర్చ మొదలైంది. ఈ మూడు ముక్కలాట ఎవరి కొంప ముంచుతుందో.. ఎవరికి కలిసి వస్తుందో అనే చర్చ జరుగుతోంది..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :