Saturday, 18 May 2024 11:37:52 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీలో కరోనా హెచ్చరికలు.. కేసులపై దృష్టి సారించిన అధికారులు..

ఏపీలో కరోనా హెచ్చరికలు.. కేసులపై దృష్టి సారించిన అధికారులు..

Date : 21 December 2022 11:55 AM Views : 193

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ప్రపంచదేశాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన కరోనా హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతోన్న కోవిడ్ కేసులపై రాష్ట్ర అధికారులు.. Covid 19: ఏపీలో కరోనా హెచ్చరికలు.. కేసులపై దృష్టి సారించిన అధికారులు.. కారణం ఏమిటంటే..Andhra Pradesh Covid 19 News ప్రపంచదేశాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన కరోనా హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతోన్న కోవిడ్ 19 కేసులపై రాష్ట్ర అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర జారీ చేసిన ఆదేశాలు, సూచనలను పాటిస్తూ.. నమోదయిన కేసులపై అనుమానం ఉన్నవాటిని జీనోమ్ సీక్వేన్సీకి పంపుతున్నారు. చాలా మందిని పోస్ట్ కోవిడ్ సమస్యలు వేధిస్తున్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కేసు నమోదు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 23.5 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారిలో సుమారు 14,733 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే మన పక్కనే ఉన్న చైనా, ఇంకా బ్రెజిల్, అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాలలో కరోనా కేసులు పెరుగున్న నేపథ్యంలో కేంద్రం కోవిడ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ మేరకు కరోనాపై దృష్టి సారించాలని దేశంలోని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు(డిసెంబర్ 21) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. కాగా, దేశంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉందని, దేశ ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని నీతి అయోగ్ కోవిడ్ 19 వర్కింగ్ చైర్మన్ ఎన్‌కే అరోరా తెలిపారు. ఇంకా మన దేశంలో రోగనిరోధక శక్తి కలిగినవారే ఎక్కువగా ఉన్నారని, ఒక వేళ కరోనా వ్యాపించిన ప్రభుత్వం దగ్గర ప్రభావవంతమైన టీకాలు ఉన్నాయని పేర్కొన్నారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :