Saturday, 15 February 2025 06:56:35 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

Date : 24 November 2024 05:39 PM Views : 180

జై భీమ్ టీవీ - జాతియం / : న్యూఢిల్లీ : పదో తరగతి పూర్తైన బాలికలకు సీబీఎస్‌ఈ బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సీబీఎస్‌ఈ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ 2024 విడుదల చేసింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగి ఉన్న పదో తరగతిపూర్తి చేసిన బాలికా విద్యార్ధినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. యేటా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినులకు ఈ నోటిఫికేషన్‌ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. అయితే దరఖాస్తు చేసుకునే బాలికలు.. తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. అలాగే సీబీఎస్‌ఈలో పదోతరగతి పూర్తి చేసి, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి లేదా పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ అర్హత కలిగిన విద్యార్థినులు డిసెంబర్‌ 23, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. సీబీఎస్‌ఈ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ పరీక్షకు 95.69 శాతం హాజరు.. త్వరలో ఫలితాలు తెలంగాణలో వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు శనివారం(నవంబర్‌ 3) నిర్వహించిన నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌) ఆన్‌లైన్‌ విధానంలో నర్సింగ్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 95.69 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,244 మంది దరఖాస్తు చేయగా 40,423 మంది పరీక్ష రాశారు. యూపీఎస్సీ ఈఎస్‌ఈ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. యూపీఎస్సీ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2024’ తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈఎస్‌ఈ మెయిన్స్‌ జూన్‌ 23వ తేదీన జరగ్గా.. అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో ఇంటర్వ్యూ నిర్వహించింది. తాజాగా తుది ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 206 మంది ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :