Sunday, 08 September 2024 06:44:54 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో దారుణం.. ట్రాక్టర్‌తో తొక్కించి వ్యక్తి దారుణ హత్య

Date : 26 October 2023 10:38 AM Views : 98

జై భీమ్ టీవీ - జాతియం / : రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బయానా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య..భూమి విషయంలో గొడవ జరిగింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదంపై ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఓ వర్గానికి చెందిన వ్యక్తులు..వివాదాస్పదమైన భూమిలోకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు సైతం అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే దామోదర్‌ గుర్జర్‌ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో భూమిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన నిర్పత్‌ గుర్జర్‌ ఆ ట్రాక్టర్ కింద పడ్డాడు. దీన్ని గమనించిన మిగతా వారు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ట్రాక్టర్ నడుపుతున్న దామోదర్‌ గుర్జర్‌…నిర్పత్‌పై నుంచే ట్రాక్టర్‌ను ముందుకు.. వెనక్కు నడుపుతూ అత్యంత క్రూరంగా చంపేశాడు. అతని నడుములు విరిగేలా చనిపోయేలా ట్రాక్టర్‌ను అతని పైనుంచి ముందుకు, వెనక్కి నడుపుతూ అందరూ చూస్తుండగానే చంపేశాడు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి చనిపోయినట్లు ప్రత్యర్థి వర్గం పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించిన పోలీసులు ట్రాక్టర్‌ నడిపిన దామోదర్‌ గుర్జర్‌ ఉద్దేశపూర్వకంగానే కిందపడిన తర్వాత అతని మీదుగా ట్రాక్టర్‌ను నడిపినట్లు గుర్తించారు. దాంతో పోలీసులు హత్య కింద కేసులు నమోదు చేసి, ట్రాక్టర్‌ నడిపిన దామోదర్‌ కోసం గాలిస్తున్నారు. భరత్ పూర్ ఘటన మానవత్వానికే మచ్చ అంటూ జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. ప్రస్తుతం రాజస్తాన్ లో ఎన్నికల జరుగుతుండటంతో.. ఈ ఘటన కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంగా మారుతోంది. రాజస్థాన్‌లో పట్టపగలే హత్యలు జరుగుతుంటే, కాంగ్రెస్‌ నేతలు ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ స్పందించాలని బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్రా డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించాలని పట్టుబట్టారాయన. దిగువన వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు. మీరు సున్నిత మనస్కులు అయితే దయచేసి వీడియో చూడకండి…

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :