Sunday, 08 September 2024 06:56:38 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఊటీ, కోడైకెనాల్ వెళ్లాలనుకునే టూరిస్టులకు హెచ్చరిక.. వచ్చే రెండు వారాలు

Date : 17 October 2023 11:39 AM Views : 115

జై భీమ్ టీవీ - జాతియం / : తమిళనాడులో టెంపుల్ టూరిజంతో పాటు పర్యటకంగా కూడా అనేక ప్రాంతాలు ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఊటీ, కొడైకెనాల్ కూడా ప్రధానమైనవి. ఊటీ, కొడైకెనాల్ హిల్ ప్రాంతాల్లో నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఊటీ నీలగిరి కొండల్లో ఉంటుంది. ఇక కొడైకెనాల్ దిండుగల్ నుంచి సమీపంలోని కొండల్లో ఉన్న మరో పర్యాటక ప్రాంతం. ఇవి ఎత్తైన కొండ ప్రాంతాలు.. అలాగే ఇక్కడ తేయాకు, కాఫీ తోటలు కూడా ఎక్కువే.. పచ్చని పర్యావరణంతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే ఈ ప్రాంతాల్లో వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. మండు వేసవిలో ఇక్కడి వాతావరణాన్ని అనుభూతి చెందడంతో పాటు మంచు దృశ్యాలు ఇక్కడ పర్యాటకులను ఇట్టే కట్టి పడేస్తుంటాయి. అక్టోబర్ నుంచే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు, అతిధి గృహాలన్ని పూర్తిగా బుక్కయ్యాయి.. ఈ రెండు ప్రాంతాలను సందర్శించేందుకు ఇప్పటికే పర్యాటకులు ఏర్పాట్లు చేసుకోగా ఒక ప్రకటన నిరుత్సాహానికి గురిచేసింది. అదే వాతావరణ శాఖ, తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటన సారాంశం ఇదే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చాలా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి మరింత వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. కాంచీపురం, కార్తెక్కల్, కడలూరు, దిండుగల్, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నీలగిరి, కోతగిరి కొండల్లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. గతంలో అనేక సందర్భాల్లో కొండచరియలు విరిగిపడి పర్యాటకులు ప్రయాణించే కార్లపై పడి అనేక మంది.మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.. ఆ సమయంలో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడ్డ సందర్భాలను అధికారులు ఉదాహరిస్తున్నారు. కాబట్టి మరో రెండు వారాల పాటు పర్యాటకులు ముందు జాగ్రత్త కోసం పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిదని అంటున్నారు.. తదుపరి వాతావరణ ప్రకటన తర్వాత ఊటీ, కొడైకెనాల్ సందర్శించడం కోసం రావొచ్చని అంటున్నారు. దీంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనించి కొందరు ఇప్పటికే తమ పర్యటనలను కొందరు వాయిదా వేసుకుంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :