Sunday, 08 September 2024 06:48:57 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

గర్భిణికి సిజేరియన్‌ చేసిన వైద్యులు.. ఆ తర్వాత తెలిసింది ఆమెకు హెచ్‌ఐవి పాజిటివ్‌ అని.. ! ఆపరేషన్‌ థియేటర్‌కు సీల్..

Date : 11 November 2023 04:19 PM Views : 137

జై భీమ్ టీవీ - జాతియం / : హెచ్‌ఐవి-పాజిటివ్ ఉన్న మహిళ తన ఇన్‌ఫెక్షన్ గురించి వైద్య సిబ్బందికి చెప్పకుండా సి-సెక్షన్ డెలివరీ చేయించుకుంది. అయితే, విషయం ఆలస్యంగా తెలియటంతో సదరు ఆస్పత్రిలో పెను దుమారం లేచింది.. డాక్టర్లు, వైద్య సిబ్బంది సర్జికల్ OT సీలు చేశారు. ఆపరేషన్ థియేటర్‌కు తాళం వేసి డాక్టర్‌తోపాటు సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అధికారుల వద్ద బాధిత మహిళ తన హెచ్ ఐవి ఇన్‌ఫెక్షన్‌ను దాచిపెట్టడం ద్వారా సి-సెక్షన్ డెలివరీ జరిగింది. ఈ విషయాన్ని మహిళ గురువారం వెల్లడించడంతో ప్రభుత్వాసుపత్రిలోని సర్జికల్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను మూసివేసి సీల్‌ వేశారు. సర్జరీలో పాల్గొన్న వైద్యులు సహా సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ మేరకు..ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డా. యోగేష్ సింగారే తెలిపిన వివరాల ప్రకారం… నవంబర్ 4న గర్భిణికి శస్త్రచికిత్స జరిగింది. కానీ గురువారం, ఆ మహిళ తనకు గల HIV సంక్రమణ గురించి సమాచారం ఇచ్చింది. యువతికి చికిత్స చేసిన గైనకాలజిస్ట్ డా. సీమ సోనీని వివరణ కోరినట్టు యోగేష్ సింఘారే తెలిపారు. ఇదిలా ఉండగా, సీమా సోనీ తనకు ఆ విషయం తెలియదని వివరిస్తూ.. తనకు హెచ్‌ఐవీ పాజిటివ్ అని మహిళ కానీ, ఆమె భర్త కానీ తనకు చెప్పలేదని అన్నారు.. నేను ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వద్ద ఎందుకు దాచిపెడతానంటూ వాపోయారు. పైగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇలాంటి పని ఎందుకు చేస్తానంటూ డాక్టర్‌ సోనీ వివరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :