Sunday, 08 September 2024 06:46:26 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్లేయింగ్ కార్డ్స్ తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల ఇండియా కుర్రాడు!

Date : 07 October 2023 02:55 PM Views : 118

జై భీమ్ టీవీ - జాతియం / : గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తూంటారు. వారిలో గెలిచిన వారు కొంత మంది అయితే.. విఫలం అయిన వాళ్లు చాలా మంది ఉంటారు. అలా భారత దేశానికి చెందిన ఎంతో మంది గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల దాకా ఏంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు కూడా గిన్నీస్ రికార్డు సాధించాడు. అది కూడా ప్లేయింగ్ కార్డ్స్ తో. చాలా మందికి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు.. ప్లేయింగ్ కార్డ్స్ తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల ఇండియా కుర్రాడు! గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తూంటారు. వారిలో గెలిచిన వారు కొంత మంది అయితే.. విఫలం అయిన వాళ్లు చాలా మంది ఉంటారు. అలా భారత దేశానికి చెందిన ఎంతో మంది గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల దాకా ఏంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు కూడా గిన్నీస్ రికార్డు సాధించాడు. అది కూడా ప్లేయింగ్ కార్డ్స్ తో. చాలా మందికి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు కొంత మంది సరదాగా ఆడుతూంటారు. కానీ కొంత మంది మాత్రం జూదంగా ఆడుతూంటారు. అయితే మనం చిన్నప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ తో చిన్నగా బిల్డింగ్స్ కడుతూ ఉంటాం. ఇలా ఎంతో మంది ఆడే ఉంటారు. ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటే వాటితో సరదాగా బిల్డింగులు కడుతూ ఆనందించే వారు. జస్ట్ కొంచెం గాలి వేసినా, ఒక వేలు ఆనించినా మొత్తం పడిపోయేది. ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటిని ఉపయోగించి ఈ కుర్రాడు గిన్నీస్ రికార్డు సాధించాడు. ఇంతకీ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ రికార్డ్ సాధించిన కోల్ కతాకు చెందిన అర్నవ్: భారత దేశంలోని కోల్ కతాకు చెందిన అర్నవ్ అనే 15 ఏళ్ల కుర్రాడు గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించాడు. కోల్ కతాకు చెందిన నాలుగు రకాల భవన నిర్మాణాలను ప్లేయింగ్ కార్డ్స్ తో తయారు చేశాడు. 41 రోజుల పాటు ఈ భవన నిర్మాణాలను తయారు చేసి.. మొత్తాన్ని వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. అర్నవ్ రూపొందించి భవనాలు 11 అడుగుల పొడవు, నాలుగు అంగుళా ఎత్తు, 16 అడుగులు, 8 అంగుళాల వెడల్పుతో అతి పెద్ద ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్ గా రూపొందించి ప్రపంచ రికార్డును సాధించాడు. బైగాన్ బెర్గ్ సృష్టించిన రికార్డ్ ను బద్దలు కొట్టాడు. రైటర్స్ బిల్డింగ్, షహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ వంటి ప్రతి రూపాలను నిర్మించడానికి అర్నవ్ 1,43,000 కార్డులను ఉపయోగించాడు. చాలా ఆనందంగా అనిపించింది: అర్నవ్ అనంతరం బాలుడు అర్నవ్ మాట్లాడుతూ.. వరల్డ్ రికార్డ్ సాధించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. నా తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. కోల్ కతాకు చెందిన నాలుగు ప్రతిరూపాలను ఎంచుకుని చేశాను. మధ్యలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నేను నిరాశ పడకుండా మళ్లీ చేశానని అర్నవ్ చెప్పాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆ బాలుడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :