జై భీమ్ టీవీ - జాతియం / : టాప్ బ్యూటీ రష్మిక మందన్న రేంజ్ పెరిగిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఆతర్వాత అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది పుష్ప. ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఈ మధ్యనే హిందీలోకి అడుగుపెట్టింది. హిందీలో పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో ఏకంగా లిప్ లాక్ తో అదరగొట్టింది రష్మిక. అయితే లిప్ లాక్ సీన్స్ కోసం రష్మిక ఎక్స్ ట్రా ఛార్జ్ చేస్తుందని వార్తలు కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. రెమ్యునరేషన్ తో పాటు ఇలా లిప్ లాక్ సీన్స్ కోసం ఎక్స్ ట్రా ఛార్జ్ చేస్తుందని వస్తున్న వార్తల పై రష్మిక టీమ్ క్లారిటీ ఇచ్చింది. రెమ్యునరేషన్ తప్ప ఎక్స్ ట్రా ఛార్జ్ తీసుకోదు అని క్లారిటీ ఇచ్చారు. ఒకసారి సినిమా సైన్ చేసిన తర్వాత ఆ సినిమాకు అవసరమైన వరకు ఆమె పని చేస్తుందని తెలిపారు. ఎలాంటి రెమ్యునరేషన్ ఎక్స్ ట్రా తీసుకోదు అని క్లారిటీ ఇచ్చారు రష్మిక టీమ్. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తుంది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది రష్మిక.
Admin