Sunday, 08 September 2024 06:51:42 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న ‘ప్రశ్నలకు లంచం వ్యవహారం’.. రంగంలోకి పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ

Date : 29 October 2023 09:52 AM Views : 98

జై భీమ్ టీవీ - జాతియం / : ప్రశ్నలకు లంచం వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానికి పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలు తానే ఇచ్చినట్లు అంగీకరించారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. తాను లోక్‌సభలో అడిగే ప్రశ్నలను టైప్‌ చేయడానికి లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు వస్తోన్న ఆరోపణలను ఎంపీ ఖండించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. దర్శన్‌ హీరానందానిని ప్రశ్నించడానికి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు ఎంపీ. ఈవిషయంలో ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుంది. తనప్రశ్నలు ఎప్పటికప్పుడు పోస్టు అవుతుంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్‌సైట్లను నిర్వహించే ఎన్‌ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని స్పష్టం చేశారు ఎంపీ మొయిత్రా. దర్శన్‌ తనకు ఏదైనా ఇచ్చి ఉంటే.. వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్‌లో తనకు 2 కోట్లు ఇచ్చినట్లు లేదు.. ఒకవేళ నగదు ఇస్తే.. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో పార్లమెంట్‌లో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకొన్నవే ఉన్నాయంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఎంపీ మొయితా పై వస్తున్న ఆరోపణలపై పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఈనెల 31న హాజరుకావాలని ఎథిక్స్‌ కమిటీ మహువాకు సమన్లు జారీ చేసింది. హాజరుకావడానికి సమయం కోరడంతో నవంబర్‌ రెండుకు మార్చారు. ఎథిక్స్‌ కమిటీ విచారణలో ఏఏ విషయాలు వెలుగులోకి వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కోరిక మేరకు మొయిత్రా లంచాలు, ముడుపులు స్వీకరించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణల అనంతరం దీనిపై రాజకీయాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. అయితే, మొయిత్రా పార్టీ తృణమూల్ ఈ వివాదానికి దూరంగా ఉండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :