Sunday, 08 September 2024 06:49:33 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి ధరలు.. ప్రస్తుతం కేజీ ఉల్లి ధర ఎంతో తెలుసా?

Date : 29 October 2023 09:53 AM Views : 115

జై భీమ్ టీవీ - జాతియం / : కొన్ని నెలల క్రితం టమాట ధరలు దేశ వ్యాప్తంగా బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. కిలో టమాట ఏకంగా రూ.300లకుపైగా పలికింది. దీంతో కొనలేక.. తిన లేక సామాన్యుడు తలకిందులయ్యాడు. ఇప్పుడు ఉల్లి కూడా అదే బాట పట్టింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.70కి అమ్ముడవుతోంది. ఉల్లిపాయలు ధరల పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది. నవంబర్‌ మొదటి వారం నాటికి కిలో ఉల్లి రూ.100కి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాల్లోనే ఉల్లిధర కిలో రూ.30 నుంచి రూ.70కి చేరిపోయింది. ఉత్తర భారతంలోని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో నవరాత్రులు ముగిసిన తర్వాత ఉల్లి ధరలు పెరుగడం ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా హోల్‌సేల్ మార్కెట్ యార్డులలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం క్వింటాల్‌ ధర రూ.4 వేలకు చేరడంతో పాటు రిటైల్‌ మార్కెట్‌లో ధరలు కూడా పెరిగాయి. మరోవైపు రిటైల్ మార్కెట్‌లో కర్నూలు ఉల్లి కిలో రూ.60కి, మహారాష్ట్ర రకం ఉల్లి కిలో రూ.70కి పలుకుతోంది. వ్యాపారులు వివిధ కారణాలను చూపుతూ నాణ్యత లేని ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడం వల్లనే ఉల్లి ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు అంటున్నారు. భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్ – సరఫరా మధ్య అంతరం ఏర్పడి ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో అల్లం ధర రూ.160 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుతం విశాఖపట్నంలో 40 టన్నులు మాత్రమే లభ్యమవుతున్నాయి. పనాజీలో వారం రోజుల క్రితం కిలో రూ.50కి విక్రయించిన ఉల్లి ఇప్పుడు రూ.60కి చేరింది. బెలగావిలో హోల్‌సేల్ వ్యాపారులు వసూలు చేసే అధిక ధరల కారణంగా ఈ పెరుగుదల గోవాలో ధరలపై ప్రభావం చూపుతుంది. పొరుగు రాష్ట్రాల్లో అస్థిరమైన రుతుపవనాలు పంటల ఉత్పత్తి తగ్గడానికి దారితీసింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగాయి. వినియోగదారులు ఉల్లికి ప్రత్యామ్నాయం చూస్తున్నారు. వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం బఫర్ ఉల్లి విక్రయాలను వేగవంతం చేసింది. ధరల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ నుంచి 1.70 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను మార్కెట్‌లో విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరింత ఉల్లి స్టాక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. శనివారం ఢిల్లీలోని 400 సఫల్‌ రిటైల్‌ స్టోర్లలో కేజీ ఉల్లి రూ.67కు విక్రయించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :