Saturday, 27 July 2024 01:18:22 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

చివరి దశకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్.. ఏ క్షణాన అయినా కార్మికులు బైటికొచ్చే అవకాశం!

Date : 25 November 2023 08:25 AM Views : 173

జై భీమ్ టీవీ - జాతియం / : 13 రోజుల పాటు దాదాపు 320 గంటలకు పైగా… సొరంగంలో చిక్కుకుని… ప్రాణాలు అరచేత బట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ 41 మందికీ విముక్తి లభించబోతోంది. ఏ క్షణాన అయినా వాళ్లంతా బైటి ప్రపంచంలోకి అడుగు పెట్టే ఛాన్సుంది. ఉత్తరకాశీ సొరంగ ప్రమాదం ఎపిసోడ్‌… క్లయిమాక్స్‌లోకొచ్చేసింది. అయితే చివర దశలో రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. శిధిలాలను తొలగించే పని శాస్త్రీయంగా కాకుండా భౌతికంగా చేపడుతున్నారు. మళ్లీ ఆగర్ మిషన్ ఎదురుగా ఇనుము లాంటిది వస్తువు అడ్డంగా రావడంతో ఆ యంత్రంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేయాలని నిర్ణయించారు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. దీనికి మరింత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఈ రాత్రి, శుక్రవారం నవంబర్ 24న రెస్క్యూ ఆపరేషన్ సాధ్యం కాకపోవచ్చంటున్నారు. ఇరుక్కుపోయిన యంత్రాన్ని తొలగించే పని కూడా జరుగుతోంది. రెండువారాలుగా ఉత్కంఠ రేపుతున్న సిల్క్‌యారా సొరంగం రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కొచ్చేసింది. 41 మంది కార్మికుల్ని వెలికి తీసుకొచ్చేందుకు 13 రోజులుగా నాన్‌స్టాప్‌గా జరుగుతున్న సహాయక చర్యల్లో గురువారం ఇబ్బందులు తలెత్తాయి. సిల్క్యారా టన్నెల్‌లో 41 మంది కూలీలను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం డ్రిల్లింగ్ పని నిలిపివేసి రెస్క్యూ టీం.. శిధిలాలను చేతితో తొలగిస్తున్నారు. సొరంగం ముఖద్వారం నుంచి సమాంతరంగా మరో చిన్న సొరంగాన్ని తవ్వి కార్మికులు ఒక్కొక్కర్ని బయటకు తీసుకురావాలన్నది యాక్షన్ ప్లాన్. ఇందుకోసం 65 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. గమ్యానికి 12 మీటర్ల దూరంలో డ్రిల్లింగ్‌ యంత్రం మెష్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. 24 గంటల పాటు శ్రమించి వెల్డింగ్‌ ద్వారా 22 టన్నుల బరువున్న డ్రిల్లింగ్ మెషిన్‌ని బయటకు తీశారు టన్నెలింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌. మళ్లీ డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ టన్నెల్ పూర్తయి.. కార్మికులను చేరుకోగానే.. వాళ్లను పైపు ద్వారా బైటికి ఎలా తీసుకురావాలన్న ట్రయల్ రన్ కూడా చేసింది NDRF. 80 సెంటీమీటర్ల వెడల్పున్న ఈ పైప్‌లైన్‌ నుంచి చక్రాలున్న స్ట్రెచర్‌ను లోపలికి పంపుతారు. అవతలి వైపు ఉన్న కార్మికులు.. దానిపై బోర్లా పడుకుంటారు. తాళ్ల ద్వారా ఆ స్ట్రెచర్‌ను జాగ్రత్తగా బైటికి లాగాలన్నది ఐడియా. బైటికొచ్చిన కార్మికులకు మొదటగా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. వెంటనే ఆస్పత్రికి తరలించడానికి 40 అంబులెన్సులను సిద్ధం చేశారు. ఇటీవలే సొరంగం లోపలి వీడియోను కూడా రిలీజ్ చేశారు. లోపలికి ఎండోస్కోపిక్‌ కెమెరా పంపి వాకీటాకీ ద్వారా కార్మికులతో మాట్లాడింది రెస్క్యూ టీమ్‌. ఆ వీడియోలు చూపి… అందరినీ క్షేమంగా తీసుకువస్తామని కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. టన్నెల్‌లో ఉన్న కార్మికుల కోసం మంగళవారం నుంచి ఘనాహారం, డ్రైఫ్రూట్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు పంపుతున్నారు. ONGCతో పాటు ఐదు కేంద్ర సంస్థలు సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. దాదాపు తలుపు దగ్గరకు చేరుకున్నట్టే.. ఏ క్షణాన అయినా తలుపు తట్టి కార్మికులను బైటికి తీసుకొస్తాం అంటూ భరోసా ఇచ్చారు ఇంటర్నేషనల్ టన్నెల్ ఎక్స్‌పర్ట్ అర్నాల్డ్ డిక్స్. ట్రయల్‌ రన్‌లో చూపినంత సులభంగా, సురక్షితంగా ఆ 41 మంది కార్మికులూ బైటికొస్తారన్న నమ్మకం కొద్దికొద్దిగా బలపడుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :