Sunday, 08 September 2024 06:55:02 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

క్యాన్సల్‌ చేయాలనుకున్న రైలు టికెట్‌ను వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని తెలుసా.?

Date : 15 October 2023 08:34 AM Views : 101

జై భీమ్ టీవీ - జాతియం / : రైలు ప్రయాణం అంటేనే ఎన్నో రోజులు ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో నెలల ముందుగానే టికెట్‌ను బుక్‌ చేసుకుంటారు. అయితే తీరా ప్రయాణ సమయానికి అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తే ఏం చేస్తారు. ఏముంది టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాల్సిందే అంటారా.? అయితే టికెట్ క్యాన్సిల్‌ చేసుకోవడం వల్ల మనం చెల్లించిన దానికంటే కొంత డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. అయితే టికెట్‌ను క్యాన్సల్ చేయకుండా ఇతరుకుల ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలాంటి ఓ అవకాశాన్నే తీసుకొచ్చింది ఇండియన్‌ రైల్వే. టికెట్‌ను క్యాన్సిల్‌ చేయకుండా ఇతరులకు బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. అయితే టికెట్‌ను కేవలం ఫాదర్‌, మదర్‌, సిస్టర్‌, బ్రదర్‌, కొడుక, కుమార్తె, భర్త లేదా భార్య ఇలా దగ్గరి కుటుంబ సభ్యులకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంతకీ టికెట్‌ను ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలి, ఇందులో ఉండే నిబంధనలు ఏంటంటే.. * రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు రైల్వే అధికారులకు విషయాన్ని వెల్లడిస్తే టికెట్ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. * టికెట్ కన్ఫర్మ్‌ అయిన వారు మాత్రమే తమ టికెట్‌ను వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. * ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణించేవారు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక ఐడీ ప్రూఫ్‌ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. * ఇక టికెట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలనుకుంటే ముందుగా కన్ఫామ్‌ అయిన టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలి. అనంతరం ట్రాన్స్‌ఫర్‌ చేయాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన ఆధార్‌ కార్డు లేదా పాన్‌ కార్డు లేదా ఓటర్‌ ఐడీ ఉండాలి. * వీటిని తీసుకొని దగ్గరల్లోని ఏదైనా రైల్వే స్టేషన్‌ టికెట్ రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లి. టికెట్ ట్రాన్స్‌ఫర్‌ కోరుతూ రిక్వెస్ట్‌ ఇవ్వాలి. ఐడీ ప్రూఫ్‌లను చెక్‌ చేసిన తర్వాత అధికారులు టికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వీరికి కూడా అవకాశం.. ఇక కేవలం సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా.. మరికొందరికి కూడా రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. ఆన్‌డ్యూటీ మీద ప్రయాణం చేసే ప్రభుత్వ ఉద్యోగులు తమ తోటి ఉద్యోగికి టికెట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అలాగే విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరు మీద టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :