Sunday, 08 September 2024 06:54:01 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఇండిగో విమానంలో శ్రుతి మించిన తాగుబోతు లీలలు.! ఫ్లైట్ లో అనుచిత ప్రవర్తన.

Date : 21 November 2023 09:29 AM Views : 169

జై భీమ్ టీవీ - జాతియం / : విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. కొందరు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను దుర్భాషలాడటం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇండిగో ఫ్లైట్‌లో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడూ ఇలాగే చేశాడు. అసలేం జరిగిందంటే.. ఇండిగో విమానం నవంబర్‌ 17న జైపూర్‌ నుంచి బెంగళూరు బయలుదేరింది. ఆ విమానంలో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. క్రూ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సిబ్బంది ఆ ప్రయాణికుడిని పలు మార్లు హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌కాగానే సదరు ప్రయాణికుడ్ని పోలీసులకు అప్పగించారు. ఇండిగో నుంచి అందిన ఫిర్యాదు మేరకు సదరు ప్రయాణికుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసు సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. వ్యక్తి ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :