Sunday, 08 September 2024 06:59:19 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నిఠారీ సీరియల్‌ మర్డర్‌ కేసుల్లో అల్హాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష రద్దు!

Date : 17 October 2023 11:36 AM Views : 114

జై భీమ్ టీవీ - జాతియం / : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ మర్డర్‌ కేసులో ఉరి శిక్ష పడిన ఇద్దరు నిందితులకు అల్హాబాద్‌ హైకోర్టు సోమవారం (అక్టోబర్ 16) నిర్దోశుషులుగా ప్రకటించింది. నిందితుడు సురీందర్‌ కోలీపై ఉన్న 12 కేసుల్లో కోర్టు నిర్దోషిగా తేల్చుతూ తీర్పు ఇచ్చింది. దీంతో అతనికి విధించిన ఉరిశిక్ష కూడా కోర్టు రద్దు చేసింది. అలాగే మోనీందర్‌ సింగ్‌ పంధేర్‌పై ఉన్న 2 కేసులను అలహాబాద్‌ హైకోర్టు రద్దు చేసింది. తగిన సాక్ష్యాధారాలతో ప్రాసిక్యూషన్‌ నిరూపించడంలో విఫలం కావడంతో పంధేర్‌, కోలీలకు విధించిన మరణ శిక్షకు వ్యతిరేకంగా చేసుకున్న అప్పీళ్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ మేరకు నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. వీరిపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేనందువల్ల త్వరలో వీరు జైలు నుంచి విడుదలకానున్నారు. తాజా తీర్పుకు సంబంధించిన వివరణాత్మక తీర్పు తర్వాత అందుబాటులోకి వస్తుందని పంధేర్‌ తరపు న్యాయవాది మనీషా భండారీ మీడియాకు తెలిపారు. కాగా 2006లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని నిథారీలోనున్న మొనీందర్ సింగ్ పంధేర్ నివాసంలో అనేక మానవ అవశేషాలు వెలుగు చూశాయి. నిథారీ ప్రాంతంలోని పంధేర్‌ ఇంటి లోపల ఉన్న పెరట్లోని కాలువలో 8 మంది పిల్లల అస్థిపంజరాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను మభ్యపెట్టి ఇంట్లోకి రప్పించి వారిని అత్యాచారం చేసి, హత్య చేశారనేది ప్రధాన ఆరోపణలు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :