Sunday, 08 September 2024 06:46:08 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా భూ ప్రకంపనలు.. 3.1 తీవ్రతతో..

Date : 16 October 2023 10:12 AM Views : 101

జై భీమ్ టీవీ - జాతియం / : దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం వణికించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆదివారం సాయంత్రం 4.08 గంటల ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. అక్టోబరు 3న ఇదే విధమైన బలమైన కుదుపులు సంభవించాయి. ఆదివారం నాటి భూకంపం తీవ్రత 3.1గా నమోదైంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఫరీదాబాద్‌కు తూర్పున తొమ్మిది కిలోమీటర్లు, ఢిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎలాంటి నష్టం, ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. పశ్చిమ నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు బలమైన ప్రకంపనలను అనుభవించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. దేశంలో సంభవించిన వరుస భూకంపాలలో ఇది అత్యంత బలమైనది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించిన వెంటనే, నెటిజన్లు ఈ వార్తలను X ద్వారా వైరల్‌గా మార్చేశారు. రోజుకి ఐదు, ఆరు పుదీనా ఆకులు తింటే ఏమౌతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి.. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా మరోమారు భూమి కంపించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. ప్రాంతీయ రాజధాని హెరాత్‌కు వెలుపల 34 కిలోమీటర్ల దూరంలో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, గతంలో సంభవించిన బలమైన భూకంపాలు వేలాది మందిని మింగేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో భూ కంపం పెను విధ్వంసాన్ని మిగిల్చింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :