Sunday, 08 September 2024 06:47:39 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన

Date : 13 December 2022 01:19 PM Views : 247

జై భీమ్ టీవీ - జాతియం / : న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ వద్ద చైనా సైనికులు ఘర్షణకు దిగిన అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం పార్లమెంటులో మాట్లాడారు. యాంగ్‌త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా తిప్పికొట్టాయని చెప్పారు. 2022 డిసెంబరు 9న జరిగిన ఈ సంఘటనలో భారతీయ సైనికులు ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా దీటుగా ఎదుర్కొనే సత్తా భారత సైన్యానికి ఉందన్నారు. చైనా దళాల ప్రయత్నాన్ని మన దళాలు దృఢ సంకల్పంతో ఎదిరించాయని చెప్పారు. ఈ ఘర్షణలో భౌతిక, శారీరక పోరాటం జరిగిందని చెప్పారు. పీఎల్ఏ దళాలు మన దేశ భూభాగంలోకి చొరబడకుండా మన సైనికులు ధైర్యసాహసాలతో నిలువరించారని చెప్పారు. పీఎల్ఏ దళాలు తిరిగి తమ స్థావరాలకు వెళ్ళిపోయే విధంగా చేశారని చెప్పారు. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారన్నారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడటం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ జరగలేదని సభకు స్పష్టం చేస్తున్నానని తెలిపారు. ఇండియన్ మిలిటరీ కమాండర్స్ సకాలంలో జోక్యం చేసుకుని పీఎల్ఏ సైనికులు తిరిగి వెళ్ళిపోయేలా చేశారన్నారు. మన దళాలు మన దేశ సరిహద్దులను కాపాడటానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లోని యథాతథ స్థితిని సవాల్ చేసి, మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొట్టడానికి మన దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చైనా సైనికులు ఘర్షణకు దిగడం గురించి చైనా వద్ద దౌత్య మార్గాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :