Sunday, 08 September 2024 06:49:03 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

'ది కేరళ స్టోరీ' మూవీపై మధ్యప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం

Date : 06 May 2023 04:03 PM Views : 164

జై భీమ్ టీవీ - జాతియం / : 'ది కేరళ స్టోరీ' మూవీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. 'ది కేరళ స్టోరీ' చిత్రం లవ్ జిహాద్, మతమార్పిడి, ఉగ్రవాదం కుట్రలను బట్టబయలు చేసి దాని వికృత రూపాన్ని బయటపెడుతుందని చౌహాన్ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై మనకు అవగాహన కల్పిస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చామని చౌహాన్ వెల్లడించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లలు తప్పకుండా చూడాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అందుకే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చామని ఆయన వెల్లడించారు. అదా శర్మ కీలక పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ మే 05 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లవ్ జిహాద్ పేరిట కేరళలో 32 వేల మందికిపైకా అమాయక యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని చెబుతూ తెరకెక్కించారు. ఈ చిత్రంపై కేరళ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు, కొంతమంది హెచ్చరించడంతో భయపడి కేరళలో షోలని క్యాన్సిల్ చేశాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :