Sunday, 08 September 2024 06:58:57 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ సిద్ధం.. ఐఓసీ సభలో ప్రధాని మోదీ

Date : 15 October 2023 08:37 AM Views : 139

జై భీమ్ టీవీ - జాతియం / : శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. 2036 సంవత్సరంలో ఒలింపిక్స్‌ను నిర్వహించే విషయంలో భారత్ ఎలాంటి అవకాశాన్ని వదులుకోబోదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 40 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సెషన్‌ను నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ప్రధాని మోదీ అన్నారు. శనివారం సాయంత్రం, జియో వరల్డ్ సెంటర్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సెషన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఎంతో ఉత్సాహంగా ఉందని అన్నారు. 2036లో ఒలింపిక్స్‌ను సిద్ధం చేయడంలో, విజయవంతంగా నిర్వహించడంలో భారత్ ఎలాంటి అవకాశాన్ని వదులుకోదని చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహించడం దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల చిరకాల స్వప్నమని అన్నారు. 2029లో జరిగే యూత్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సపోర్ట్, ప్రోత్సాహం భారత్‌కు ఉంటుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై ప్రధాని మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేయడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. త్వరలో సానుకూల వార్తలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు తెలిపారు ప్రధాని. క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించిందన్నారు. భారతీయ సంస్కృతిలో క్రీడలు ఒక ముఖ్యమైన భాగం అని, భారతదేశంలోని గ్రామాలకు వెళితే, క్రీడలు లేకుండా ప్రతి పండుగ అసంపూర్తిగా ఉంటుందన్నారు. భారతీయులమైన మనం క్రీడా ప్రేమికులమే కాదు, దానిని జీవించే వారము కూడా అని వ్యాఖ్యానించారు. అంతకుముందు, ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ పర్యటన చాలా కీలకంగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :