జై భీమ్ టీవీ - జాతియం / : ఉన్నది ఆరు రోజులు ఎదో రోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది నయని పావని. బిగ్ బాస్ సీజన్ 7 వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది నయని పావని. అయితే ఈ అమ్మడు ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఓటింగ్ లో తక్కువ రావడమతొ నయని పావనిని బయటకు తీసుకొచ్చేశారు. ఇక ఎలిమినేట్ అని నాగార్జున అనౌన్స్ చేయగానే బోరుమని ఏడ్చేసింది నయని. హౌస్ లో ఉన్న ఆరు రోజులు హౌస్ లో అందరితో బాగా కనెక్ట్ అయ్యింది నయని పావని. ఇక ఈ చిన్నది ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో హౌస్ లో ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు. ఇక బయటకు వచ్చిన నయిని పావని హౌస్ లో ఉన్నవారి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నయని పావని బ్రేకప్ స్టోరీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. నయని పావని చేతిపై ఎస్, జే అనే టాటూ ఉంది. అయితే ఈ ట్యాటూ వెనక ఓ లవ్ స్టోరీ ఉందని తెలుస్తోంది. గతంలో ఈ ట్యాటూ మీనింగ్ షణ్ముఖ్ జస్వంత్ అని.. ఆతర్వాత ఈ ఇద్దరికి బ్రేకప్ అయ్యిందని.. అనుకున్నారు. పావని, షణ్ముఖ్ జస్వంత్ కలిసి రెండు కవర్ సాంగ్స్ చేశారు. ఆతర్వాత ఈ రెండు సాంగ్స్ డిలీట్ చేశారు. అయితే ఈ ట్యాటూకి షణ్ముఖ్ కు సంబంధం లేదట. నయని పావని ప్రేమించిన వ్యక్తి పేరు కూడా జే తో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. అందుకు కారణం కూడా చెప్పింది నయని. ప్రేమించిన తర్వాత నాకు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. నువ్వు ఇలా ఉండాలి. అలా ఉండాలి అని రూల్స్ పెట్టేవాడు. నా జీవితం మొత్తం అతనికి 9ఇచ్చినప్పుడు నా అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు. అతని చేతిలో తోలుబొమ్మలా ఉండలేను కదా అని చెప్పింది. నువ్వు చిన్న మొక్కవి.. నీళ్లు చేసి పెంచుతున్నా అని అన్నాడు అది నాకు ఇప్పటీకీ గుర్తుండి పోయింది. నేను చిన్న మొక్కనా..? నన్ను అతను పెంచడం ఏంటి.? లవ్ , లైఫ్ ఇచ్చిన తర్వాత అన్ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. అది నాకు నచ్చలేదు. అందుకే బ్రేక్ అప్ చేసుకున్నాం అని తెలిపింది నయని పావని.
Admin