Sunday, 08 September 2024 06:42:31 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రోల్‌ బాంబు దాడి.. స్పాట్‌లోనే పట్టుకున్న పోలీసులు..

Date : 26 October 2023 10:34 AM Views : 94

జై భీమ్ టీవీ - జాతియం / : తమిళనాడు రాజ్‌భవన్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు దాడి జరిగింది. చెన్నైలోని గిండీలోని గవర్నర్‌ హౌస్‌ ఎదుట పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించిన ప్రముఖ రౌడీ కరుక్క వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు రావడానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్న కోపంతో పెట్రోల్‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించినట్లు కరుక్క వినోద్‌ అంగీకరించాడు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 25) సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని గిండిలో ఉన్న రాజ్ భవన్ గేట్ నంబర్ వన్ వద్దకు వచ్చిన ఒక వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబును విసిరాడు. రాజ్ భవన్ గేట్ సెక్యూరిటీ పోలీసులు నిలబడి ఉండగా, అకస్మాత్తుగా తన చేతిలోని పెట్రోల్ బాంబు విసరడంతో అది గేటు దగ్గర పడిపోయింది. దీంతో భయాందోళనకు గురైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుపట్టారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై. రాష్ట్రంలో నేరాలు అదుపు చేయడం, శాంతిభద్రతలు పరిరక్షించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :