Sunday, 08 September 2024 06:44:23 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

చెన్నైలో డీఎంకే మహిళా సదస్సు.. హాజరైన సోనియా, ప్రియాంక

Date : 15 October 2023 08:36 AM Views : 98

జై భీమ్ టీవీ - జాతియం / : చెన్నైలో డీఎంకే మహిళా విభాగం సమరశంఖం పూరించింది. ఈ సమావేశానికి దేశం లోని మహిళా అగ్రనేతలంతా హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆహ్వానం మేరకు సోనియాగాంధీతో పాటు ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ , ఎన్సీపీ నేత సుప్రియా సూలే , సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ తదితురులు హాజరయ్యారు. ఈ సభలో మహిళా కార్యకర్తలు ఉత్సాహంగా డాన్స్‌లు చేశారు. ఐదేళ్ల తరువాత చెన్నెకి వచ్చిన సోనియాగాంధీకి ఘనస్వాగతం లభించింది. 2018లో కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరయ్యారు సోనియా. తరువాత ఇప్పుడు చెప్పతమిళనాడు ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు సోనియాగాంధీ. మహిళా హక్కులపై డీఎంకే పార్టీ ఈ సదస్సును నిర్వహించింది. మహిళలకు అన్ని రంగాల్లో సమానహక్కులు ఉండాలని సదస్సులో పాల్గొన్న నేతలు డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు ప్రియాంకాగాంధీ. హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తమ హక్కుల కోసం రాజీ పడేందుకు మహిళలు సిద్దంగా లేరని అన్నారు. మహిళలు ఓటుబ్యాంక్‌గా మాత్రమే మిగిలిపోవద్దని , రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని పిలపునిచ్చారు “కేవలం మనం ఓటుబ్యాంక్‌గా మిగిలిపోవద్దు.. అధికారంలో కూడా మనకు హక్కు కావాలి. వెంటనే మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలి. సమయం వృథా చేసుకోవడానికి భారతీయ మహిళలకు ఇంకా ఓపిక లేదు. మనకు రాజకీయ అధికారం కావాలి. అప్పుడే మన హక్కులు సాధ్యమవుతాయి. మనపై జరుగుతున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహిస్తే నష్టం జరుగుతుంది” అని ప్రియాంక పేర్కొన్నారు. మోదీ సర్కార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సోనియాగాంధీ. దేశంలో పితృస్వామ్య వ్యవస్థ ఇప్పటికి అమల్లో ఉందని , దీనికి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని విమర్శించారు . మహిళలకు అన్నిరంగాల్లో సమానహక్కులు ఇచ్చేందుకు ఇండియా కూటమి సిద్దంగా ఉందన్నారు సోనియాగాధీ. ప్రార్థనా స్థలాల్లో ఎంట్రీ కోసం కూడా మహిళలు ఇప్పటికి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు మెహబూబా ముఫ్తీ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :