జై భీమ్ టీవీ - జాతియం / : ఇది డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. అవును, 21వ శతాబ్దంలో అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణలు జీవితాన్ని చాలా సులభతరం చేశాయి., అవి మన జీవనశైలిని చాలా వరకు మార్చాయి. ప్రస్తుతం విరివిగా అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ అన్ని రంగాలు, అన్ని విభాగాల్లో విస్తృతంగా వ్యాపించింది. వ్యవసాయ రంగం మొదలు, దేశ సంరక్షణలో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. డ్రోన్ సాయంతో విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా మారింది. అంతేకాదు.. కోవిడ్ కాలంలో చాలా చోట్ల డ్రోన్ సాయంతో బాధితులకు కావాల్సిన మందులను కూడా సరఫరా చేశారు. అటు దేశ సరిహద్దులో కూడా డ్రోన్‌లను వినియోగిస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇలాంటి సాంకేతికత, డ్రోన్ వాడకం ఇప్పుడు మతపరమైన కార్యకలాపాలలో కూడా ఉపయోగించుకుంటున్నారు. అది ఆలయ నిర్మాణం కావచ్చు.. లేదా గుళ్లు, గోపురాల్లో లైటింగ్, సంగీతం మొదలైన వాటి ద్వారా పాత్రల ప్రదర్శన కావచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో మీరు గాలిలో ఎగురుతున్న ‘శ్రీ ఆంజనేయ’ విగ్రహాన్ని చూడవచ్చు. వాస్తవానికి హనుమాన్ విగ్రహాన్ని ఎవరో శాస్త్రోక్తంగా తయారు చేసిన డ్రోన్‌కు అతికించారు. ఆ తర్వాత ‘ఆంజనేయుడు’ గాలిలో ఎగురుతూ కనిపించాడు. ఈ వీడియోని మైక్రోబ్లాగింగ్ సైట్ ‘X’ లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
Admin